హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మారని మారుతిరావు...! మరోసారి జైలుకు...!! ఆస్తి రాసిస్తా...రమ్మంటూ అమృతకు రాయబారం..!!

|
Google Oneindia TeluguNews

మిర్యాలగూడ పరువు హత్య కేసులో అల్లుడిని కిరాతకంగా చంపించిన మారుతీరావు మరోసారి ఊచలు లెక్కిస్తున్నాడు. తనకు ఆస్తి రాసిస్తానంటూ కూతురుకు రాయభారం పంపిణ మారుతిరావు ప్రవర్తనపై అమృత మరోసారి ఫిర్యాదు చేసింది. దీంతో మారుతి రావుపై మరో కేసును నమోదు చేసి జైలుకు పంపారు

మారని అమృత రావు...

మారని అమృత రావు...


మిర్యాలగూడలో జరిగిన పరువుహత్య కేసులో మారుతిరావు తన మొండిపట్టుదలను వీడడం లేదు. తన మాటను కాదని కులాంతర వివాహం చేసుకుందన్న కక్షతో అమృత భర్తను కిరాతకంగా చంపించిన మారుతిరావు జైలు జీవితం అనుభవించి నెల రోజుల క్రితమే బయటకు వచ్చాడు. అనంతరం . కూతురని ఎలాగైనా తన వద్దకు తీసుకువచ్చి కేసునుండి బయటపడాలనే కుట్రలకు తెరలేపాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు రాయబారులను పంపాడు. ఆస్థి మొత్తం ఆమె పేరున రాసిస్తానని చెప్పాడు.

ప్రణయ్‌ని బిడ్డలో చూసుకుంటున్న అమృత

ప్రణయ్‌ని బిడ్డలో చూసుకుంటున్న అమృత


అయితే కూతురు అమృత మాత్రం తండ్రి ప్రయాత్నాలకు ఎప్పటికప్పుడు బ్రేకులు వస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మారుతి రావు చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొడుతుంది. తనకు పుట్టిన బిడ్డలో భర్తను ప్రణయ్‌ను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. ఇప్పుడిప్పుడే తండ్రి జ్ణాపకాల నుండి బయటపడేందుు ప్రయత్నాలు చేస్తోంది. అయితే తండ్రి మారుతీ రావు ఇటివల మరోసారి తన ప్రయత్నాలకు తెరతీయడంతో రాయబారులతో పాటు తండ్రిపై కేసును నమోదు చేసింది.

 ప్రణయ్ హత్యకేసులో బెయిల్‌పై వచ్చిన మారుతి రావు

ప్రణయ్ హత్యకేసులో బెయిల్‌పై వచ్చిన మారుతి రావు


ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతి రావుతో పాటు కుట్రతెరలేపిన మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కేసు విచారణలో భాగంగా మారుతీ రావుతో పాటు ఇతర నిందితులు సైతం బెయిల్‌పై వచ్చారు. దీంతో మారుతీ రావు ఎలాగైనా తన కూతురిని తీసుకురావాలనే పట్టుదలలో ఉన్నాడు. దీంతో ఆమెను అనుకూలంగా మార్చుకుని కేసులు లేకుండా చేయాలనే యోచనలో మారుతి రావు మరో స్కేచ్ వేశాడు.

అమృత వద్దకు రాయబారిని పంపిన తండ్రి

అమృత వద్దకు రాయబారిని పంపిన తండ్రి


ఈనేపథ్యంలోనే ఈనెల 11వ తేదిన కందుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని కూతురు అమృత వద్దకు పంపించాడు. ప్రణయ్ హత్య కేసులో తండ్రికి సహకరించి...తండ్రివద్దకు చేరుకుంటే... ఉన్న ఆస్తిని మొత్తం ఆమె పేర రాసిస్తానని చెప్పాడు. అయితే మారుతి రావు ఆలోచలను అమృత ముందే పసిగట్టింది. కట్టుకున్న భర్తనే చంపించిన వాడు తండ్రైన సహకరించేది లేదని స్పష్టం చేసింది. దీంతో తండ్రి ప్రతిపాదనను తిరస్కరించింది.

తండ్రిపై ఫిర్యాదు చేసిన అమృత ..అరెస్ట్..

తండ్రిపై ఫిర్యాదు చేసిన అమృత ..అరెస్ట్..

తండ్రి అమృత రావు ప్రయత్నలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు అమృత ఇంటికి రాయబారానికి వెళ్లిన వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆయన ఉన్న విషయాన్ని పోలీసులకు వెళ్లగక్కాడు. తనను మారుతిరావుతో పాటు ఎంఏ కరీం అనే వ్యక్తి పంపించారని తెలిపాడు. దీంతో మారుతిరావుతో పాటు మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం సాక్షిని బెదిరించడంతో పాటు ప్రలోభపెట్టడం లాంటీ కేసులను ముగ్గురుపై నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.

English summary
Maruthi Rao, who brutally killed his son-in-law in the Miryalaguda town was once again went to jail of his daughter complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X