మెగాస్టార్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ - కిషన్ రెడ్డి ఢిల్లీలో నా సీటులో : ప్రధాని మోదీ చెప్పారు..!!
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైన ఇంట్రస్టింగ్ కామెంట్స్ తో అందరి ఫోకస్ న వైపు తిప్పుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవం లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి.. అర్జున్ రావు మెగావల్ తో సహా చిరంజీవి హాజరయ్యారు. చిరంజీవి ప్రసంగంలో తన ఛలోక్తులతో నవ్వులు పూయించారు. ప్రాంతీయ సినిమాల మధ్య తెలుగు సినిమా హద్దులు చేరిపేసిందని చిరంజీవి పేర్కొన్నారు. బాహుబలి నుంచి త్రిబుల్ ఆర్ వరకు అద్భుతమైన సినిమాలు వస్తున్నాయని స్వయంగా మోడీ చెప్పారని చిరంజీవి చెప్పుకొచ్చారు.

చిరంజీవి త్రిబుల్ సీ ఫార్ములా
సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. త్రిబుల్ 'సి' ఫార్ములాతో కల్చర్, క్రాఫ్ట్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భారతీయత తత్వం పటిష్టం చేయడానికి ఉత్సవాలు ఎంతో కృషి చేస్తాయని.. సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో.. అసెంబ్లీలో కూర్చొనే కిషన్ రెడ్డి..ఢిల్లీలో తన సీటు నుంచి తనను తప్పించి..ఆయన కూర్చున్నారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో యూపీఏ 2 ప్రభుత్వంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా టూరిజం శాఖను పర్యవేక్షించారు.

తన సీటులో కిషన్ రెడ్డి కూర్చున్నారంటూ
2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోయినా.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారాన్ని ఆయన స్వయంగా ఖండించారు. తాను ఇప్పుడు సినిమాల పైన ఫోకస్ పెట్టానని.. తిరిగి రాజకీయాల వైపు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. తనకు అసలు అటువంటి ఆఫర్ రాదని స్పష్టం చేసారు. ఈ ఉత్సవాల్లో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వృత్తులను నమ్ముకుని ఉన్నవాళ్లనే కల్చరల్ ఫెస్టివల్ కు ఆహ్వానించామని చెప్పారు.

అక్క మోహన్ బాబుతో..ఇక్కడ చిరంజీవితో
ఇది ప్రభుత్వ పండగ కాదని, ప్రజల పండుగ అని చెప్పారు. 75 దేశాల్లో పర్యటక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు15వ తేదీన ప్రతి భారతీయుడి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కొద్ది రోజుల క్రితం ఏపీలో రాజమండ్రిలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఆ కార్యక్రమం లో కిషన్ రెడ్డితో పాటుగా ప్రముఖ నటుడు మోహన్ బాబు హాజరయ్యారు. ఆ వేదిక నుంచే మోహన్ బాబు తాను గతంలో బీజేపీ కోసం ఏపీలో ఎన్నికల ప్రచారం చేస్తే.. 18 శాతం సీట్లు వచ్చాయని గుర్తు చేసారు.