హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాఫ్ట్ వేర్ బ్ర‌హ్మీల‌కు మెట్రో ప్ర‌యాణం బెస్ట్..! హైటెక్ సిటీ రూట్లో మ‌రిన్ని అద‌న‌పు సౌక‌ర్యాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం మెట్రో యాజ‌మాన్యం అద‌న‌పు సౌక‌ర్యాలు క‌ల్పిస్తోంది. ఎక్కువ‌మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మెట్రో లో ప్ర‌యాణం చేసేందుకు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తోంది. అందుకోసం ఐటీ కంపెనీలతో మెట్రో అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారం రోజుల కిత్రం హైటెక్‌ సిటీకి మెట్రో సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు మెట్రోలో హాయిగా ప్రయాణం చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ, సీఈఓ కె.వి.బి.రెడ్డితో పాటు సుమారు 40 ఐటీ కంపెనీల ప్రతినిధులు బేగంపేటలోని మెట్రో రైలు భవన్‌లో సమావేశమయ్యారు.

ఐటీ కంపెనీలతో మెట్రో ఎండీ సమావేశం..! మెట్రో స్టేషన్‌ల నుంచి షటిల్‌ సర్వీసులు..!!

ఐటీ కంపెనీలతో మెట్రో ఎండీ సమావేశం..! మెట్రో స్టేషన్‌ల నుంచి షటిల్‌ సర్వీసులు..!!

మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ మెట్రోలో ప్రయాణం చేయడం వల్ల ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణతోపాటు ఎంతో విలువైన సమయం ఆదా అవుతోందన్నారు. మెట్రో టికె ట్‌, పార్కింగ్‌ ధరలతోపాటు ఇప్ప టి వరకు అందిస్తున్న ఫీడర్‌ సర్వీసుల వివరాలను ఐటీ సంస్థల ప్ర తినిధులకు తెలియజేశారు. హైటెక్‌ సిటీ మెట్రో కారిడార్‌ ప్రారంభానికి ముందు ప్రతి రోజు మెట్రోలో 1.80 లక్షల మంది ప్రయాణిస్తుండగా, మార్చి 20 తర్వాత ప్రారంభమైన హైటెక్‌ సిటీ మెట్రో కారిడార్‌లో సోమవారం ఒక్క రోజే 2.21 లక్షల మంది ప్రయాణం చేశారని, ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని పెం చడం ద్వారా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

 మెట్రో వ‌ర‌కు బ‌స్సు సౌక‌ర్యాలు..! ఫీడ‌ర్ బ‌స్సుల అనుమ‌తులు రావాల్సి ఉంద‌న్న మెట్రో ఎండీ..!!

మెట్రో వ‌ర‌కు బ‌స్సు సౌక‌ర్యాలు..! ఫీడ‌ర్ బ‌స్సుల అనుమ‌తులు రావాల్సి ఉంద‌న్న మెట్రో ఎండీ..!!

హైటెక్‌ సిటీ పరిధిలోని ఐటీ కంపెనీల తరపున నడుపుతున్న దూరప్రాంత షటిల్‌ సర్వీసులను ఇక నుంచి మెట్రో స్టేషన్‌ల నుంచి నడపాలని మెట్రో అధికారులు సూచించారు. ఎల్‌బీనగర్‌, మియాపూ ర్‌, ఉప్పల్‌, నాగోల్‌ ప్రాంతాల నుంచి నడుపుతున్న సర్వీసులను హైటెక్‌ సిటీ, దుర్గం చెరువు మెట్రో స్టేషన్‌ల నుంచి నడపాలన్నారు. దీనివల్ల ఐటీ ఉద్యోగులు మియాపూర్‌, నాగోల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల నుంచి మెట్రోలో వచ్చి దుర్గం చెరువు, హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌లలో దిగి, ఫీడర్‌ సర్వీసుల్లో తాము పనిచేసే ఐటీ కంపెనీలకు చేరుకుంటారు. ఫీడర్‌ బస్సులు నడిపేందుకు అనుమతుల కోసం సంబంధిత శాఖలతో సంప్రదింపులు చేస్తామని ఎన్వీఎస్‌ రెడ్డి ఐటీ కంపెనీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. నోవార్టీస్‌, కోనీల్యాబ్స్‌ వంటి కంపెనీలు మెట్రో స్టేషన్‌ల నుంచి ఫీడర్‌ బస్సులను నడుపుతున్నాయని, అదేవిధంగా ఇతర కంపెనీ లు ముందుకు రావాలని కోరారు.

 నెలవారీ పాసులు ఇవ్వండి..! మెట్రో ఎండిని కోరిన ఐటి యాజ‌మాన్యాలు..!!

నెలవారీ పాసులు ఇవ్వండి..! మెట్రో ఎండిని కోరిన ఐటి యాజ‌మాన్యాలు..!!

సమావేశంలో పాల్గొన్న ఐటీ కంపెనీల ప్రతినిధులు ఐటీ ఉద్యోగులు రోజు మెట్రోలోనే ప్రయాణం చేసేందుకు వీలుగా నెలవారీ పాసులను జారీ చేయాలని కోరా రు. అదేవిధంగా ఒక స్టేషన్‌ నుంచి మరో స్టేషన్‌ వరకు ప్రయాణం చేసేలా వర్తించే పాసులను సైతం జారీ చేస్తే ఐటీ ఉద్యోగులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని వారు సూచించారు. దీనికి ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి స్పం దిస్తూ.. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. హైటెక్‌ సిటీకి మెట్రో సేవలు ప్రారంభమైన నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో టికెట్ల కోసం క్యూ కట్టాల్సిన పనిలేకుండా మెట్రో స్మార్ట్‌ కార్డులను కొనుగోలు చేయాలని, స్మార్ట్‌ కార్డులను ఆయా మెట్రో స్టేషన్‌ల వద్ద అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఐటీ కంపెనీలు కోరితే బల్క్‌గా స్మార్ట్‌ కార్డులను జారీ చేస్తామన్నారు.

 సౌక‌ర్యాల‌తో పాటు మెట్రో సంఖ్య‌ను పెంచాలి..! సమావేశంలో ప‌లు సూచనలు..!!

సౌక‌ర్యాల‌తో పాటు మెట్రో సంఖ్య‌ను పెంచాలి..! సమావేశంలో ప‌లు సూచనలు..!!

ఐటీ క్యాంప్‌సలు, ఇతర ప్రాముఖ్యం ఉన్న ప్రాంతాల్లో మెట్రో రైలు నెట్‌ వర్క్‌ మ్యాపులను ఏర్పాటు చేయడం.
హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌, దుర్గం చెరువు మెట్రో స్టేషన్‌ల నుంచి సైబర్‌ షటిల్‌, షీ షటిల్‌ సర్వీసులను నడిపేలా చూడాలి. టీ-సవారీ, మెట్రో కాల్‌సెంటర్‌ల ద్వారా మెట్రో సేవలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చి ఐటీ ఉద్యోగులకు, ఐటీ కంపెనీల మేనేజ్‌మెంట్లకు తెలిసేలా చేయడం. ఐటీ కంపెనీలు, హైదరాబాద్‌ మెట్రో రైలు లి మిటెడ్‌, ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌లతో అనుసంధాన కర్తగా ఎం.సత్యనారాయణ వ్యవహరిస్తారు. ఐటీ ఉద్యోగు లు ఎక్కువ సంఖ్యలో మెట్రోలో ప్రయాణం చేయ డం ద్వారా ట్రాఫిక్‌ ఇబ్బందులు, కాలుష్య తీవ్రతను తగ్గించేలా చేయడమే మెట్రో ల‌క్ష్య‌మ‌ని అదికారులు తెలుపుతున్నారు.

English summary
In the wake of Metro services to high-tech city, IT employees have discussed the arrangements for the Metro to travel comfortably. Hyderabad Metro Rail MD NVS Reddy, about 40 IT companies, including L&T CEO KVB Reddy met with representatives at the Metro Rail Bhavan, Begampeta
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X