హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైటెక్ సిటీకి మెట్రో ప‌రుగు రేపే..! సాఫ్టువేర్ బ్ర‌హ్మీల‌కు త‌ప్ప‌నున్న ట్రాఫిక్ క‌ష్టాలు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : నాగోల్, ఉప్ప‌ల్,ఎల్బీ న‌గ‌ర్ రూట్ల‌లో వేలాది మంది ప్ర‌యాణికుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేరుస్తున్న మెట్రో ఇక హైటెక్ సిటీ రూట్ లో ప‌రుగులు పెట్ట‌నుంది. దీంతో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు త‌ప్ప‌నున్నాయి. మెట్రో రైలు ఈ నెల 20న హైటెక్‌ సిటీకి పరుగులు పెట్టనుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హైటెక్‌ సిటీ మెట్రో కారిడార్‌ను ఉదయం 9.15 గంటలకు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ జెండా ఊపి ప్రారంభిస్తారు.

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా జరిగే ఈ కార్యక్రమంలో కొందరు ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొంటారని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికులను మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి అనుమతిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఆదేశాల మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ ఎండీ కె.వి.బి.రెడ్డితో కలిసి సోమవారం హైటెక్‌ సిటీ మెట్రో కారిడార్‌లో పర్యటించారు.

న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌కు 'ఓలా' ప‌రిష్కారం..! టీ స‌ర్కార్ తో అవ‌గాహ‌న ఒప్పందం..!!న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌కు 'ఓలా' ప‌రిష్కారం..! టీ స‌ర్కార్ తో అవ‌గాహ‌న ఒప్పందం..!!

 Metro run to high-tech city ..! Software employees are away from traffic problems.. !!

హైటెక్ సిటీ వ‌ర‌కు మెట్రో ప్రారంభం కానుండ‌డంతో రెండు కారిడార్లు 56కిలో మీట‌ర్ల మేర అందుబాటులోకి రానుంది. వీటిలో కారిడిర్ 1 మియాపూర్ నుంచి ఎల్బీఈన‌గ‌ర్ 29కీమీ, కారిడార్ 2 నాగోల్ టు హైటెక్ సిటీ 27కిమీ లో మెట్రో రైలు ప‌రుగులు పెట్ట‌నున్నాయి. ఇప్ప‌టికే 46కిమీట‌ర్ల‌తో దేశంలో నే రెండో అతిపెద్ద కారిడార్ గా నిలిచిన మెట్లోకు మ‌రో 10 కిమీ జ‌త కారుంది.

కాగా తొలి ద‌శ‌లొ ప్ర‌తిపాదించిన 72కిమీల‌లో మ‌రో 15కిమీ మార్గం అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇందులో జీబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వ‌ర‌కు 9కిమీ నిర్మాణంలో ఉండ‌గా మ‌రొ 6 కిమీ పాత బ‌స్తీ మార్గంలో ఇంకా ప‌నులు ప్రారంభం కాలేదు, జీబీయ‌స్ నుండి ఎంజీబీఎస్ మార్గాన్ని ఈ ఏడాది చివ‌రిక‌ల్లా ప్రారంభించే దిశ‌గా ప‌నులు సాగుతున్నాయి మెట్రో అదికారులు చెప్పుకొస్తున్నారు.

English summary
The long-awaited high-tech city metro corridor will begin at 9.15 am at the Amirpet Metro Station where the Governor Narsimhan flag starts waking up. Metro officials said that only some senior officials would be involved in the program without any delay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X