హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెట్రో రైలు.. త్వరలోనే ప్రారంభం..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భాగ్యనగరంలో మెట్రో రైలుకు ఆదరణ పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దాంతో మెట్రో అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మెట్రో సర్వీస్ ప్రారంభమైన తొలినాళ్లలో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అయితే క్రమక్రమంగా ఆయా రూట్లలో మెట్రో సర్వీసులు ప్రారంభం కావడం.. వాటిలో ప్రయాణించడంతో సమయం కలిసిరావడం.. ఇదంతా కూడా ప్లస్ అయింది. అదే క్రమంలో జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి ఇమ్లిబన్ బస్ స్టేషన్ వరకు మరో సర్వీస్ ప్రారంభం కానుంది.

జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇమ్లిబన్ బస్ స్టేషన్ వరకు మరో మెట్రో రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రూట్‌లో డిసెంబర్ నుంచి మెట్రో సర్వీస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. కారిడార్ - 2 పరిధిలోకి వచ్చే ఈ రూట్ మొత్తం 15 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అయితే డిసెంబర్ నుంచి 9.6 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీస్ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ మేరకు అనుమతులు కూడా లభించాయి.

metro service from jubilee bus station to mgbs starts soon

భార్యపై కోపం.. నాలుక ఖతం.. ఓ భర్త చేసిన పనికి..!

హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మిగతా కారిడార్లలో కూడా త్వరలోనే రైళ్లు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. నగరంలో మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 9 కోట్ల మంది ప్రయాణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొత్తానికి నగరమంతటా మెట్రో పరుగులు పెడితే హైదరాబాద్ వాసులకు సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణం కూడా ఈజీ కానుంది.

English summary
Another metro train from Jubilee bus station to Imliban bus station is to start soon. Officials are preparing to launch the Metro service from December on this route. The corridor - 2 falls within 15 km of this route. However, since December, 9.6 km of the Metro service has been drilled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X