హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేగం పెంచిన మెట్రో..! రెండు నిమిషాలకు ఓ రైలుతో య‌మా దూకుడు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ వచ్చేపోయే మెట్రో రైళ్లతో సందడిగా మారింది. హైటెక్‌ సిటీకి మెట్రో ప్రారంభం కావడంతో నాలుగో ఫ్లాట్‌ఫాం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఇక్కడ మూడు ఫ్లాట్‌ఫాంలే వినియోగంలో ఉండేవి. నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ మార్గం మధ్యలో అమీర్‌పేట స్టేషన్‌ ఉంది. ఇక్కడి నుంచి హైటెక్‌ సిటీకి 10 నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నారు. ఈ మెట్రో ఎక్కలేకపోతే మరో మెట్రో కోసం ఇంకో పది నిమిషాలు ఎదురుచూపులు తప్పవు. కానీ ప్రస్తుతం మరో అవకాశం ఉంది. మెట్రో వెళ్లినా మరో రెండు నిమిషాల్లోనే ఇంకో మెట్రో ను సిద్దం చేసారు అదికారులు.

మెట్రో లో ప్ర‌యాణించేందుకు ఆస‌క్తి చూపుతున్న యువ‌త‌..!!

మెట్రో లో ప్ర‌యాణించేందుకు ఆస‌క్తి చూపుతున్న యువ‌త‌..!!

మెట్రో లో ప్ర‌యాణించేందుకు ఆస‌క్తి చూపుతున్న యువ‌త‌..!!
అమీర్‌పేట స్టేషన్‌లో పెరిగిన సందడి..! మెట్రో లో ప్ర‌యాణించేందుకు ఆస‌క్తి చూపుతున్న యువ‌త‌..!!
పెరిగిన ప్ర‌యాణీకుల ర‌ద్దీని ద్రుష్టిలో ఉంచుకుని నాగోల్‌కు సైతం అమీర్‌పేట నుంచి 6 నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నారు. మధ్య మధ్యలో రెండు నిమిషాలకే మరో మెట్రో ఉంటోంది. ఈ మెట్రో వెళ్లాక మరోటి హైటెక్‌ సిటీ నుంచి రావాలి.. అక్కడేమో 10 నిమిషాల ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దీంతో బేగంపేట పాకెట్‌ ట్రాక్‌పై నిలిపిన మెట్రోని రివర్సల్‌లో అమీర్‌పేట వరకు తీసుకొచ్చి.. ఇక్కడి నుంచి ఇదివరకులా నాగోల్‌కు నడుపుతున్నారు. దీంతో ఆరు నిమిషాల ఫ్రీˆక్వెన్సీని అందుకోగలుగుతున్నారు.

ప్ర‌తి రెండు నిమిషాల‌కు ఓ మెట్రో..! హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న ప్ర‌యాణీకులు..!!

ప్ర‌తి రెండు నిమిషాల‌కు ఓ మెట్రో..! హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న ప్ర‌యాణీకులు..!!

ఒక దశలో రెండు ఫ్లాట్‌ఫాంల మీదకు రెండు నిమిషాల వ్యవధిలో నాలుగు మెట్రో రైళ్లు వెళుతున్నాయి. ఎప్పటిలాగే అమీర్‌పేటలో నాగోల్‌ వెళ్లే మెట్రో ఫ్లాట్‌ఫాం రద్దీగా కన్పిస్తుండగా.. కొత్తగా మొదలైన హైటెక్‌ సిటీ ఫ్లాట్‌ఫాం వైపు జనం పల్చగా ఉంటున్నారు. క్రమంగా ప్రయాణికులు పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యమధ్యలో రెండు నిమిషాల వ్యవధిలో రెండు మెట్రో రైళ్లు నడపడానికి ట్విన్‌ సింగిల్‌ లేన్‌ విధానమే కారణం అని అదికారులు చెప్తున్నారు. అమీర్‌పేట నుంచి రెండేసి నిమిషాల వ్యవధిలో బయలుదేరే రెండు మెట్రోలు ఎడమవైపు ట్రాక్‌లోనే హైటెక్‌ సిటీకి చేరుకుంటాయి.

నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు ప్రారంభంనాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు ప్రారంభం

 అమీర్ పేట-హైటెక్ సిటీ లో పెరిగిన ర‌ద్దీ..! మెట్రో ఎక్కేందుకు సై అంటున్న జ‌నం..!!

అమీర్ పేట-హైటెక్ సిటీ లో పెరిగిన ర‌ద్దీ..! మెట్రో ఎక్కేందుకు సై అంటున్న జ‌నం..!!

ముందు వెళ్లిన మెట్రో హైటెక్‌ సిటీ స్టేషన్‌లో ప్రయాణికులను దించి సైబర్‌ టవర్స్‌ వరకు వెళ్లి అక్కడ ఆగుతోంది. ఈ లోపు వెనక వచ్చిన మెట్రో హైటెక్‌ సిటీ స్టేషన్‌లో ప్రయాణికులను దించి వచ్చిన ట్రాక్‌లోనే వెంటనే తిరుగుపయనం అవుతుంది. దీని వెనక రెండు నిమిషాల వ్యవధిలో సైబర్‌ టవర్స్‌ వద్ద ఆగిన మెట్రోని పంపుతున్నారు.ఈ మెట్రోలు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ట్రాక్‌ మారేవరకు 10 నిమిషాలు పడుతోంది.

 మెట్రో సంఖ్య పెంచిన అదికారులు..! లోపాలు జ‌ర‌క్కుండా ముందు జాగ్ర‌త్త‌లు..!!

మెట్రో సంఖ్య పెంచిన అదికారులు..! లోపాలు జ‌ర‌క్కుండా ముందు జాగ్ర‌త్త‌లు..!!

ఈ లోపు అమీర్‌పేట నుంచి బయలుదేరిన రెండు మెట్రోలు కుడివైపు ట్రాక్‌లోకి మారుతాయి. హైటెక్‌ సిటీకి చేరుకుని తిరుగు పయనం అవుతాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు మధ్యలో ఎక్కువ అంతరం ఏర్పడితే పాకెట్‌ ట్రాక్‌పై ఉన్న మెట్రోని రివర్సల్‌లో అమీర్‌పేటకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి నాగోల్‌కు పంపిస్తున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఫ్రీక్వెన్సీని సర్దుబాటు చేసేందుకు మెట్రో యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది.

English summary
The Ameerpet Interchange Station became bustling with metro trains coming. The metro was launched to high-tech city and the fourth flat form was made available to passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X