హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో భూ ప్రకంపనాలు, గత రాత్రి 13 సార్లు కంపించిన భూమి, భయాందోళన..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో స్వల్పంగా భూమి కంపించింది. గత రాత్రి 8.15 గంటల నుంచి రాత్రి 11.25 గంటల వరకు భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రతీసారి కనీసం 5 సెకన్ల పాటు ప్రకంపనాల ప్రభావం చూపింది. దీంతో జనం భయపడి.. బయటకు వచ్చారు.

Recommended Video

#Earthquake : Borabanda లో 13 సార్లు కంపించిన భూమి.. క్లారిటీ ఇచ్చిన అధికారులు! || Oneindia Telugu

జగన్‌కు కేంద్రం గుడ్‌ న్యూస్‌- హైదరాబాద్‌-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో ఏపీ...జగన్‌కు కేంద్రం గుడ్‌ న్యూస్‌- హైదరాబాద్‌-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో ఏపీ...

 భూ ప్రకంపనాలు

భూ ప్రకంపనాలు

రాత్రి 8.15 గంటల నుంచి 9 గంటల మధ్య 12 సార్లు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపిచింది. భూమి లోపల భారీ శబ్దాలు వెల్లువడ్డాయి. దీంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. జూబ్లీహిల్స్, రహమత్ నగర్, బోరబండ సైట్-3, ఎస్పీఆర్ హిల్స్, అల్లాపూర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 1.5గా ఉంది. అయితే రాత్రి 9 గంటల తర్వాత ప్రకంపనాలు ఆగడంతో జనం ఇళ్లలోకి వెళ్లిపోయారు.

 ఈ ప్రాంతాల్లోనే..

ఈ ప్రాంతాల్లోనే..

బోరబండ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ పురం సైట్-3 వీర్ సెక్షన్‌ నగర్‌లో భూమి కంపించింది. సాయిరామ్ నగర్, ఆదిత్యానగర్, పెద్దమ్మ నగర్, జయవంత్ నగర్, భవానీనగర్, అన్నానగర్, రహమత్ నగర్‌లోని ఎస్పీఆర్ హిల్స్‌లో శబ్దాలు వచ్చాయి. ప్రజలంతా ప్రాణభయంతో హడలిపోయారు. క్షణాల్లోనే సర్దుకుందని.. దీంతో ప్రమాదం ఏమీ లేదు అని సీనియర్ సైంటిస్ట్ శ్రీనగేశ్ తెలిపారు.

అర్ధరాత్రి మరోసారి

అర్ధరాత్రి మరోసారి

అయితే రాత్రి 11.25 గంటలకు మరోసారి భూమి కంపించింది. 5 సెకన్లపాటు పెద్ద శబ్దంతో ప్రకంపనాలు వచ్చాయి. దీంతో రాత్రి బోరబండలో జనం జాగారం చేశారు. భారీ శబ్దాలు, భూప్రకంపనలతో జనం ఆందోళన చెందారు. మూడేళ్ల క్రితం కూడా ఇలానే భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. మరోవైపు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇవాళ బోరబండలోని సైట్-3, అల్లాపూర్, వీకర్స్ కాలనీలో ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తల బృందం పర్యటించనుంది.

English summary
earthquake in Hyderabad borabanda division area in friday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X