హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు తథ్యం.. గ్రేటర్ క్యాంపెయిన్‌లో బండి సంజయ్ సంచలనం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తథ్యం అని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతితో కురుకుపోయిందని చెప్పారు. రాంనగర్‌లో ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన జైలుకు పోవటం ఖాయమన్నారు.

అందరూ ఇండియన్లే, బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ కామెంట్లపై అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ అటాక్అందరూ ఇండియన్లే, బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ కామెంట్లపై అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ అటాక్

గెలుపే ధ్యేయం..

గెలుపే ధ్యేయం..

గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఒక్కో డివిజన్‌కు 5 కోట్ల రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కానీ మీ ఆమూల్యమైన ఓటు మాత్రం బీజేపీకి వేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలెవరూ వెళ్ళటం లేదన్నారు. సారు‌‌.. కారు.. కేసీఆర్ ఇక రారు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ప్రజల సంగతేంటి..

ప్రజల సంగతేంటి..

కేసీఆర్, ఆయన కుటుంబం మంచిగా ఉంటుందని.. మరి రాష్ట్ర ప్రజల సంగతేంటని అడిగారు. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొందని చెప్పారు. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని చెప్పారు. ఇదేంటో అర్థం కావడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని గమనించాలని కోరారు జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయని చెప్పారు.

Recommended Video

Delhi Chalo : ఆరు నెలలకు సరిపడా రేషన్ తెచ్చుకున్నాం, తాడో పేడో తేల్చుకునే వెళ్తాం అంటున్న రైతులు
తిరుగుబాటు తప్పదు

తిరుగుబాటు తప్పదు

గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని జోస్యం చెప్పారు. వారు ఎందుకు తిరుగుబాటు చేస్తారో మాత్రం తెలియజేయలేదు. గ్రేటర్‌లో గెలిచేది బీజేపీ అని.. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని మరోసారి ఉద్ఘాటించారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయి.. అప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.

English summary
mid term elections compulsory in telangana state bjp state chief bandi sanjay predicsts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X