హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాలేజీ డ్రాపవుట్స్‌కు చెక్: తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల బలోపేతం దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

కరోనా భయం వద్దు కానీ, 'వారియర్స్’కు కేసీఆర్ తీపికబురు, రోగులకు వైద్యంలో రాజీలేదుకరోనా భయం వద్దు కానీ, 'వారియర్స్’కు కేసీఆర్ తీపికబురు, రోగులకు వైద్యంలో రాజీలేదు

ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి తిరిగి వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని సీఎం కేసీఆర్ చెప్రారు. ఈ పరిస్థితిని నివారించడంతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందివ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు.

 midday meals for govt colleges students in telangana: CM KCR.

'జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వివిధ రకాల మొక్కలతో గార్డెన్లను అభివృద్ధి చేయాలి. వివిధ కళాశాలల్లోని బాటనీ అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించాలి' అని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో గార్డెన్ అభివృద్ధి చేసి, అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణకు మాత్రమే సొంతమైన ఆండ్రో గ్రాఫిన్ నల్లమలయాన మొక్కను బహుకరించారు

జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్ కు కావాల్సిన రూ. 50 లక్షల నిధులను సీఎం మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ పాల్గొనారు.

English summary
midday meals for govt colleges students in telangana: CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X