హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్షీణించిన అక్బరుద్దీన్ ఆరోగ్యం.. మెరుగైన చికిత్స కోసం లండన్‌కు తరలింపు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎంఐఎం సీనియర్ నేత, చాంద్రయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించింది. 2011లో జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా అప్పటి నుంచి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత దెబ్బతినడంతో మెరుగైన వైద్యం అక్బరుద్దీన్‌ను లండన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అక్బర్ సోదరుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థించాలని పార్టీ శ్రేణులు, అభిమానుల్ని కోరారు.

2011 ఏప్రిల్ 30న బార్కస్‌లో ఓ ఎన్నికల ర్యాలీ సందర్భంగా అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగింది. పహిల్వాన్ అనే రౌడీషీటర్ తన అనుచరులతో కలిసి అక్బరుద్దీన్‌పై కాల్పులు జరిపారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అక్బరుద్దీన్ మెరుగైన చికిత్స అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే అప్పటి నుంచి ఆయనను అనారోగ్యం వెంటాడుతోంది. బుల్లెట్ ముక్కలు తొలగించే అవకాశంలేకపోవడంతో తన కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని స్వయంగా అక్బరుద్దీన్ ప్రకటించారు. డయాలసిస్ చేయించుకోవాల్సి రావడంతోగతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఎక్కువగా ప్రచారంలో పాల్గొనలేదు.

MIM Leader Akbaruddin owaisi moved to london for better treatment

తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా ఉన్న అక్బరుద్దీన్ చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో జేడీఎస్ తరహాలో తెలంగాణలో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తుందని, అవసరమైతే తానే సీఎం పదవి కూడా చేపట్టవచ్చని అక్బరుద్దీన్ అన్నారు.

English summary
MIM Leader, chandrayanagutta MLA Akbaruddin owaisi Health deteriorated. In 2011 he was seriously injured in an attack. from then his health steadily diminishing. now his health health further deteriorated, he was moved to london for better Treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X