హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి ఈటల పేషిలో కరోనా కలకలం: ఏడుగురికి పాజిటివ్, శుక్రవారం ఇంట్లోనే ఆమాత్యులు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలోనూ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషిలో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుకు కనీసం 2 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి.

 ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్: రాష్ట్రంలో రేపట్నుంచే తెరచుకోనున్న బార్లు, 20శాతం కరోనా రుసుం ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్: రాష్ట్రంలో రేపట్నుంచే తెరచుకోనున్న బార్లు, 20శాతం కరోనా రుసుం

ఏడుగురికి కరోనా..

ఏడుగురికి కరోనా..

వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేషీలో ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మన్లు ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి ఈటల రాజేందర్ సహా బీఆర్కే భవన్‌లోని పేషీ మిగతా సిబ్బంది మొత్తం పరీక్షలు చేయించుకున్నారు. అయితే అందరికీ నెగెటివ్‌ వచ్చింది. కరోనా వైరస్ కేసులు రావడంతో ఈటల రాజేందర్ శుక్రవారం బీఆర్కే భవన్‌కు రాలేదు. ఇంట్లోనే ఉండి ఉదయం, సాయంత్రం సందర్శకులను కలిశారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.

 తగ్గుతోన్న వెంటిలేటర్ల సంఖ్య

తగ్గుతోన్న వెంటిలేటర్ల సంఖ్య

ఇదిలాఉంటే మరోవైపు కరోనా వైరస్ కోసం చికిత్స ఇస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూ, వెంటిలేటర్ల బెడ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నెల 14వ తేదీ వరకు 1,222 అందుబాటులో ఉండగా... నాలుగు రోజుల నుంచి తగ్గిస్తూ వస్తున్నారు. బుధవారం వరకు 1,177 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని హెల్త్‌ బులెటిన్‌ ద్వారా నిర్ధారణ అవుతుంది. ఈ లెక్కన చూస్తే 45 బెడ్లు తగ్గాయి. అదే సమయంలో 14వ తేదీ నాటికి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌, ఐసీయూ పడకలు 2,129 ఉండగా.. ప్రస్తుతం అవీ 121 పెరిగి 2,250కి చేరుకున్నాయి.

ఎస్సై మృతి..

ఎస్సై మృతి..

కరోనా వైరస్ మరో ఖాకీని కబలించింది. హైదరాబాద్‌ మాదాపూర్‌ ఎస్సై అబ్బాస్‌ అలీ శుక్రవారం చనిపోయారు. వైరస్ కోసం చికిత్స తీసుకొని మృతిచెందారు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడంలో అబ్బాస్ కీలకంగా వ్యవహరించారు. ఇటు జగిత్యాలలో కాన్పు కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన గర్భిణికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. కరోనా లక్షణాలు ఉన్నాయని డెలివరీ చేసుందుకు వైద్యులు నిరాకరించారు. బతిమిలాడితే శస్త్రచికిత్స చేశారు. బాబుకు జన్మనిచ్చిన అనంతరం మహిళను వేరే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో శిశువు సహా బాలింతను స్టేచర్‌పై బయటకు తీసుకు రాగా.. మరో ఆస్పత్రి వారు చేర్చుకోవడానికి నిరాకరించారు.

Recommended Video

COVID-19 : China లో బయటపడ్డ ప్రమాదకర బ్యాక్టీరియా.. ఇతర దేశాలకు వ్యాపిస్తుందా..? || Oneindia Telugu

English summary
telangana health minister etela rajender peshi 7 members infected coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X