• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రంగనాయక సాగర్ ప్రారంభోత్సవ వేళ.. హరీశ్‌పై కేటీఆర్ సరదా కామెంట్స్.. ఏమన్నారంటే

|

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో భాగంగా నేడు(ఏప్రిల్ 24)న మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌ దగ్గర రంగనాయక సాగర్ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రారంభించారు.ప్రాజెక్ట్ సొరంగం వద్ద మోటార్ పంప్ ఆన్‌ చేసి రంగనాయకసాగర్‌ జలాశయంలోకి గోదావరి జలాలు విడుదల చేశారు. 2,300 ఎకరాల్లో రూ.3,300 కోట్ల వ్యయంతో మూడు టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయాన్ని నిర్మించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు,కేటీఆర్ మాట్లాడారు.

హరీశ్ రావు నిరంతరం శ్రమించారన్న కేటీఆర్

హరీశ్ రావు నిరంతరం శ్రమించారన్న కేటీఆర్

రంగనాయక సాగర్ ప్రాజెక్టుతో సిద్ధిపేట,రాజన్న సిరిసిల్ల జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా హరీశ్‌రావు నిరంతరం శ్రమించారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు కాలంతో పోటీపడి పనిచేశారనడంలో అతిశయోక్తి లేదన్నారు. సీఎం కేసీఆర్‌కు సిద్ధిపేట అంటే అమితమైన ప్రేమ అని..మెతుకు సీమ తెలంగాణకు బువ్వ పెట్టే జిల్లా కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.

రాష్ట్రంలో నాలుగు విప్లవాలు

రాష్ట్రంలో నాలుగు విప్లవాలు

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో, మంత్రి హరీశ్‌రావు శ్రమతో తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణంగా మారే కల త్వరలోనే సాకారం అవబోతుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో నాలుగు విప్లవాలు చూడబోతున్నాని చెప్పారు. రాష్ట్రంలో హరిత విప్లవం,నీలి విప్లవం,క్షీర విప్లవం,గులాబీ విప్లవం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.రంగనాయకసాగర్ ప్రాజెక్టును పర్యాటకపరంగానూ అభివృద్ది చేసే విషయంపై ఆలోచిస్తున్నామన్నారు. ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులకు మరోసారి ధన్యవాదాలు చెబుతున్నామని.. వారి త్యాగం వెలకట్టలేనిదని వ్యాఖ్యానించారు. తన అమ్మమ్మ,నానమ్మ ఊర్లు కూడా గతంలో ప్రాజెక్టుల నిర్మాణంలో మునిగిపోయాయని పేర్కొన్నారు.

  Coronavirus : 31 Infected In Suryapet By One Woman Who Visited Several Houses For Ashtachamma Game
  సిద్దిపేటకు ఐటీ.. కేటీఆర్ సరదా కామెంట్స్

  సిద్దిపేటకు ఐటీ.. కేటీఆర్ సరదా కామెంట్స్

  సిద్దిపేటకు ఐటీ పరిశ్రమలు కూడా తీసుకురావాలని మంత్రి హరీశ్ రావు తనను కోరారని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే ఇప్పటికే సిద్ధిపేటను చూసి అంతా అసూయ పడుతున్నారని.. తమకు తెలియకుండా సిద్దిపేటలో ఇంకా ఏమేమీ కట్టారో చూపించాలని సరదాగా వ్యాఖ్యానించారు. సిద్దిపేటకు గోదావరి జలాలు వచ్చాయని.. త్వరలోనే రైలు కూత కూడా వినిపిస్తుందని అన్నారు. హరీశ్ రావు లాంటి నాయకుడు ఉన్నచోట జిల్లావాసులకు ఏ లోటు ఉండబోదన్నారు.

  English summary
  Telangana ministers KT Rama Rao and Harish Rao inaugurated the Ranaganayaka Sagar project in Chandrapur village in Siddipet district on Friday. They let out water from Godavari into the Ranganayaka Sagar project from the surge pool.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more