హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ts assembly:ఈటల పక్కన జగదీశ్ రెడ్డి, భౌతికదూరం ఏదీ అని స్పీకర్ చురకలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభించడంతో అసెంబ్లీ సమావేశాలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విధిగా కరోనా వైరస్ పరీక్ష చేయించుకోవాలని.. రిపోర్టుతో రావాలని స్పష్టంచేశారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే రావొద్దని కూడా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అసెంబ్లీ నుంచి ఇంటికి, ఇంటి నుంచి అసెంబ్లీకే రావాలని కూడా సూచించారు. ఈసారి విజిటర్స్ గ్యాలరీ కూడా లేదు. సభలో గల సీట్లలో మార్కింగ్ చేశారు. కొన్ని సీట్లను బ్లాక్ చేసి.. పక్క సీట్లలో కూర్చొవద్దని స్పష్టంచేశారు.

సభలో కొన్ని సీట్లను నో సీటింగ్ జోన్లుగా ప్రకటించారు. అక్కడ ఎవరూ కూర్చొవద్దు అని అర్థం. అయితే గురువారం సభ జరుగుతుండగా.. ఈటల రాజేందర్ వద్దకు మంత్రి జగదీశ్ రెడ్డి వచ్చారు. వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గమనించారు. భౌతికదూరం తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టంచేశారు.

minister jagadish reddy sat behind etela, speaker ask why..

Recommended Video

Telangana New Revenue Act 2020 : తెలంగాణా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, రెవెన్యూ కోర్టులు రద్దు !

వారిద్దరినీ చూసి.. జగదీశ్ రెడ్డిని ఎందుకు అక్కడ కూర్చొన్నారని ప్రశ్నించారు. నో సీటింగ్‌లో కూర్చొవద్దు అని చెప్పారు. దీంతో అక్కడినుంచి జగదీశ్ రెడ్డి తన సీటులోకి వెళ్లిపోయారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. భౌతికదూరం కంపల్సరీ పాటించాలని సభ్యులకు స్పీకర్ స్పష్టంచేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

English summary
telangana minister jagadish reddy sat behind etela in assembly. speaker pocharam srinivas reddy asked why sat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X