హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యలు విలసిల్లే నా తెలంగాణ కోటి రతనాలవీణ..!

విద్యలు విలసిల్లే నా తెలంగాణ కోటి రతనాలవీణ

|
Google Oneindia TeluguNews

విద్యకు నెలవైన తల్లి సరస్వతి కొలువైంది తెలంగాణలోనే. అభివృద్ధికి నెలవైన కేసీఆర్ పాలన కొలువు దీరిందీ తెలంగాణలోనే. ఆధ్వర్యంలోనే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పం ఒక్కటే.. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిం‌చా‌లనేది. ఆ సంకల్పం బలంగా ఉన్నప్పుడు కచ్చితంగా కోరిక నెరవేరుతుంది. నెరవేరింది కూడా.

700 పాఠశాలలు ప్రారంభం

700 పాఠశాలలు ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన ఊరు-మన బడి', 'మన బస్తీ-మన బడి' కార్యక్రమంలో భాగంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న 700 ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా గంభీరావుపేట్ లో నిర్మించిన క్యాంపస్ ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆరు ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ క్యాంపస్ లో ఆధునిక తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఉన్నాయి. అలాగే అత్యాధునిక ప్రమాణాలతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటు చేశారు.

విరివిగా గ్రంథాలయాల ఏర్పాటు

విరివిగా గ్రంథాలయాల ఏర్పాటు


ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన ప్రారంభమైంది. తొలిమెట్టు కార్యక్రమం ద్వారా విద్యా ప్రమాణాల పెంపుదలకు ప్రభుత్వం కృషిచేస్తోంది. పాఠశాలల్లో గ్రంథాలయాలను విరివిగా నెలకొల్పడంవల్ల విజ్ఞానాన్ని ఆర్జించే అరుదైన అవకాశం లభించింది. బాలికలకు శానిటేషన్‌ కిట్లను త్వరలోనే అందజేయనున్నారు. ఇలా విభిన్నమైన కార్యక్రమాలను రూపొందించడంద్వారా కార్పొరేట్ బడులను తలదన్నేలా సర్కారు బడులు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి.

రాష్ట్రంలో ఉత్తమ మానవ వనరుల కోసం

రాష్ట్రంలో ఉత్తమ మానవ వనరుల కోసం

విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి మండలానికి 4 మోడల్‌ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి రూ.7,200 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా సర్కారు బడుల్లో సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాథమిక దశలో మంచి పునాది వేస్తే.. భవిష్యత్తులో మంచి విద్యార్థులు తయారవుతారని, తద్వారా రాష్ట్రంలో ఉత్తమ మానవ వనరులు తయారవుతాయనేది కేసీఆర్ ఆలోచన. ఈ తరహా వాతావరణాన్ని సృష్టించడంద్వారా విద్యార్థికి బడికి వెళ్లాలన్న ఉత్సాహం కలుగుతుంది. ఒక్కో బడిపై రూ.5 లక్షల నుంచి కోటిరూపాయల వరకు ఖర్చుపెట్టింది. దశలవారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

English summary
700 beautifully designed government schools have started as part of the 'Mana Ooru-Mana Badi' and 'Mana Basti-Mana Badi' programs undertaken by the Telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X