హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినట్టుగా కాంగ్రెస్ తీరు ... రైతుబంధుపై విమర్శలపై కేటీఆర్ ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అద్భుతంగా పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నేతలకు కెసిఆర్ పాలన కడుపు మంట తెప్పిస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడిన మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్ర ప్రజలకు బహుళ ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అది కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు.

 పత్తిత్తుల్లా కేసీఆర్,కేటీఆర్ ల మాటలు .. ప్రజల ముందు తేల్చుకుందాం రండి : రేవంత్ రెడ్డి సవాల్ పత్తిత్తుల్లా కేసీఆర్,కేటీఆర్ ల మాటలు .. ప్రజల ముందు తేల్చుకుందాం రండి : రేవంత్ రెడ్డి సవాల్

 కాంగ్రెస్ పార్టీ నిర్వహించే జలదీక్షలకు అర్థం ఉందా ?

కాంగ్రెస్ పార్టీ నిర్వహించే జలదీక్షలకు అర్థం ఉందా ?

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో ఊరు చెరువు లోకి ప్రవేశించిన గోదావరి జల హారతి ఇచ్చిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక కాంగ్రెస్ పార్టీ తీరు నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినట్లుగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు .కాంగ్రెస్ పార్టీ నిర్వహించే జలదీక్షలకు అర్థం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతాంగం కోసం ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ రైతులకు సాగునీరు అందిస్తుంటే కాంగ్రెస్ నేతలకు కళ్ళు ఎర్రబడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నేతలకు సిగ్గుందా?ఆరేళ్లలో సీఎం కేసీఆర్ ఏం చేశారో కనబడటంలేదా?

కాంగ్రెస్ నేతలకు సిగ్గుందా?ఆరేళ్లలో సీఎం కేసీఆర్ ఏం చేశారో కనబడటంలేదా?


అన్నేళ్ళు పాలించి ఏం చేయలేకపోయారు అంటూ విమర్శించిన కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. కేవలం కోపం మరియు ఈర్ష్యతో కాంగ్రెస్ నేతలు అధికార పార్టీ పై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. గతంలో రైతులను రాబందుల్లా పీక్కుతిన్నది కాంగ్రెస్ నేతలు కాదా అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆరేళ్లలో సీఎం కేసీఆర్ ఏం చేశారో కనబడటంలేదా అంటూ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు రైతుసంక్షేమం కోసం నిరంతరం తపన పడుతున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు కేటీఆర్.

కాంగ్రెస్ నేతలు ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ నేతలు ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

చెరువులు నిండుతుంటే,పొలాలు పచ్చబడుతుంటే ప్రతిపక్షాల కళ్ళు కూడా పచ్చబడుతున్నాయని, ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. 60 ఏళ్ల పాలనలో ఏమి చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరేళ్లలో కేసీఆర్ చేసిన పనికి తట్టుకోలేకపోతున్నారా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తిట్టినా స్వీకరిద్దాం కానీ వారి చేతిలో మోసపోవద్దంటూ మంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేసిన వారికే రైతుబంధు వర్తింపజేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై అది నియంత్రిత సాగు కాదు, నియంతృత్వ సాగు, నియంత సాగు అంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

English summary
Telangana Minister KTR said that the state of Telangana CM KCR is excellent. He said that the KCR regime is not digestable for Congress leaders. Minister KTR said that the people of the state are benefiting from the KCR's perspective. It has been criticized by Congress leaders for not being able to take the positive things .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X