హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్...? ఫ్లాష్ బ్యాక్‌ గుర్తు తెచ్చుకున్న కేటీఆర్..

|
Google Oneindia TeluguNews

ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్తే హైదరాబాద్‌ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సుల జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇలాగే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లి డబుల్ డెక్కర్ బస్సులను గుర్తుచేసుకున్నారు. తాను అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించినట్లు గుర్తుచేసుకున్నారు. హుస్సేన్ అనే ఓ నెటిజన్ హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించండి సార్.. అంటూ కేటీఆర్‌కు ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశాడు. దీంతో కేటీఆర్ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

నెటిజన్ ట్విట్టర్ పోస్టుపై స్పందించిన కేటీఆర్... డబుల్ డెక్కర్ బస్సులను పూర్తిగా ఎందుకు ఆపేశారో తనకు కూడా తెలియదన్నారు. అయితే వాటిని మళ్లీ హైదారాబాద్‌ రోడ్లపైకి తీసుకొచ్చే అవకాశం​ ఏమైనా ఉందా అని రవాణా ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌ను అడిగారు. ఇందుకోసం తన పోస్టులో మంత్రి పువ్వాడను ట్యాగ్ చేశారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా కేటీఆర్‌ సూచించారు. స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్... దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీతో మాట్లాడుతానని బదులిచ్చారు.మొత్తం మీద ఓ నెటిజన్ పుణ్యమాని హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్ సర్వీసులపై మళ్లీ చర్చ జరుగుతోంది.

minister ktr remembers double decker buses in his school days

హైదరాబాద్‌లో నిజాం కాలం నుంచే డబుల్ డెక్కర్ బస్ సర్వీసులున్నాయి. ముఖ్యంగా జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జ‌ల్‌గంజ్‌, అబిడ్స్‌, హుస్సేన్ సాగ‌ర్‌, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌ వరకు డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవి. అయితే కాల క్రమంలో అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. ఆర్టీసీ వాటిని ఎందుకు పక్కనపెట్టిందన్నది తెలియదు. అయితే పర్యాటకుల కోసం లేదా ప్రయాణికుల కోసం మళ్లీ ఆ బస్సులను తీసుకొస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సదరు నెటిజన్ వ్యక్తపరిచాడు.చూడాలి మరి... హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ చక్కర్లు కొడుతాయో.. లేక ఈ చర్చకు ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పడుతుందో..!!

English summary
IT Minister KT Rama Rao appears to have taken a nostalgic trip down memory lane early on Saturday morning, recalling the days when he used to take the iconic green double decker bus to school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X