హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉదయం కాంగ్రెస్‌లోకి.. సాయంత్రం టీఆర్ఎస్‌లోకి.. మంత్రి మల్లారెడ్డి అనుచరుడు..

|
Google Oneindia TeluguNews

ఎన్నికల వేళ టికెట్ల కోసం నేతలు పార్టీ మారడం కామన్‌గా మారిపోయింది. అందుకే ఓవైపు సొంత పార్టీలో టికెట్ కోసం ప్రయత్నిస్తూనే.. మరోవైపు ప్రత్యర్థి పార్టీలో అవకాశంపై ఓ కన్నేసి ఉంచే నేతలకు ఇప్పుడు కొదువలేదు. సొంత పార్టీలో టికెట్ దక్కలేదంటే.. ఆ వెంటనే ప్రత్యర్థి పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. అయితే పొద్దున్నే ప్రత్యర్థి పార్టీలో చేరి.. సాయంత్రం తిరిగి సొంతగూటికి చేరుతున్న నేతల రాజకీయాలు జనాలను ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

ఇదీ జరిగింది :

ఇదీ జరిగింది :

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని ఫీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టికెట్ కోసం టీఆర్ఎస్ నేత,మంత్రి మల్లారెడ్డి ప్రధాన అనుచరుదు దర్గ దయాకర్ రెడ్డి గట్టిగా ప్రయత్నించారు. చివరి నిమిషం వరకు ప్రయత్నించినా ఆయనకు టికెట్ రాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన శుక్రవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని కలిసి.. ఆయన సమక్షంలోనే పార్టీలో చేరారు. దయాకర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి వెళ్లడంతో మల్లారెడ్డికి గట్టి షాక్ తగిలినట్టయింది.

బుజ్జగింపులతో మెత్తబడ్డ దయాకర్ రెడ్డి

బుజ్జగింపులతో మెత్తబడ్డ దయాకర్ రెడ్డి

దయాకర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో మల్లారెడ్డి ఉలిక్కిపడ్డారు. ఆఘమేఘాల మీద ఆయన ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దయాకర్ రెడ్డి మెత్తబడకపోవడంతో తన వెంటే కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆపై సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్‌లతో ఫోన్‌లో మాట్లాడించి బుజ్జగించారు. దీంతో పునరాలోచించుకున్న దయాకర్ రెడ్డి తిరిగి మల్లారెడ్డి గులాబీ కండువా కప్పేసుకున్నారు. దయాకర్ రెడ్డి ఇలా ఒకే రోజు అటు కాంగ్రెస్,ఇటు టీఆర్ఎస్ కండువాలు కప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

 ముగిసిన నామినేషన్ల పర్వం

ముగిసిన నామినేషన్ల పర్వం


మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21,850 నామినేషన్లు దాఖలయ్యాయి. రెబల్ అభ్యర్థుల నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 14 వరకు గడువు ఉంది. ఇక కరీంనగర్ కార్పోరేషన్‌కు ఆలస్యంగా నోటిఫికేషన్ విడుదలైంది. అక్కడ ఈ నెల 12 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

 టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలనుకుంటోన్న కాంగ్రెస్

టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలనుకుంటోన్న కాంగ్రెస్

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో లాగే ఈ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడ్ అన్న ధీమాతో టీఆర్ఎస్ ఉంది. మరోవైపు కాంగ్రెస్,బీజేపీలు కూడా శక్తి మేర గెలుపు కోసం కృషి చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చి తమ సత్తా ఏంటో చూపించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది.

English summary
In an abrupt turn of events, TRS leader Dayakar Reddy who joined the Congress party on Friday morning returned back to his party within hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X