మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా.. మంత్రి ఎర్రబెల్లితో కలిసి పాల్గొన్నాకే పాజిటివ్ రిపోర్ట్
కరోనా వ్యాప్తి పెరుగుతుంది. ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా రోజుకు 3 వేలకు పైబడి కరోనా కేసులు వస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా ఆయనకు కొవిడ్ టెస్టులు నిర్వహించగా, పాజిటివ్ వచ్చింది. మంత్రి నిరంజన్ రెడ్డి నిన్న కూడా గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు.
తనకు కరోనా సోకడంపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నిరంజన్ రెడ్డి ఇవాళ కూడా తన నివాసం నుంచి ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. సహచర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి నాబార్డు రాష్ట్ర దృష్టి పత్రాన్ని విడుదల చేశారు. సో ఆయన కూడా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడి ఉంటారు. లక్షణాలు కూడా ఒకేలా ఉండటంతో ఏదీ కరోనో.. ఏదీ ఒమిక్రాన్ నిర్ధారించడం కష్టం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే కరోనా, ఒమిక్రాన్ ఓకేలా చూస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి వరకు కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుందనే వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.
ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసరి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఇవాళ మంత్రి నిరంజన్ రెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు.