హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ కార్యకర్తలు తనను చంపటానికి ప్రయత్నిస్తే చికెన్ నారాయణ సమర్ధిస్తారా : మంత్రి పువ్వాడ ధ్వజం

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల పోలింగ్ సమయంలో తెలంగాణా రోడ్డు రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే . కూకట్ పల్లిలో మంత్రి వాహనంలో టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు దాడి చెయ్యటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

అయితే పువ్వాడ కారుపై దాడి చేసిన సమయంలో వాహనంలో ఆయన లేరు . ఈ ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు .

గ్రేటర్ వార్ .. కూకట్ పల్లిలోఉద్రిక్తత .. మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై దాడిగ్రేటర్ వార్ .. కూకట్ పల్లిలోఉద్రిక్తత .. మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై దాడి

బీజేపీ కార్యకర్తలు తనను చంపటానికి ప్రయత్నించారన్న మంత్రి పువ్వాడ

బీజేపీ కార్యకర్తలు తనను చంపటానికి ప్రయత్నించారన్న మంత్రి పువ్వాడ

బిజెపి కార్యకర్తలు తనను చంపటానికి ప్రయత్నించారని
బాచుపల్లి లో తన మెడికల్ కళాశాలకు వెళుతుండగా ఫోరమ్ మాల్ దగ్గర బిజెపి కార్యకర్తలు తన కాన్వాయ్ పై దాడి చేశారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బిజెపి నేతలు ఓడిపోతామనే ఫ్రస్టేషన్ తో తనపై దాడి చేశారని మంత్రి పువ్వాడ ఫైర్ అయ్యారు. కమలం పువ్వు నేతలు చెబుతున్నట్టు కారులో డబ్బులు పెట్టి పంచడానికి తాను వెర్రి పువ్వును కాదని మండిపడ్డారు పువ్వాడ అజయ్ కుమార్.

సిపీఐ నారాయణపై పువ్వాడ ధ్వజం .. తానూ కమ్యూనిస్ట్ బిడ్డనేనని

సిపీఐ నారాయణపై పువ్వాడ ధ్వజం .. తానూ కమ్యూనిస్ట్ బిడ్డనేనని

బిజెపి కార్యకర్తలు తనను చంపడానికి ప్రయత్నించారని తనపై దాడి చేసిన సమయంలో బిజెపి కార్యకర్తలు కారు పైకి ఎక్కి నానా హంగామా సృష్టించారని అన్నారు. అయితే తన కాన్వాయ్ లోని ఒక కారు పై బిజెపి కార్యకర్తలు ఆ విధంగా ప్రవర్తించారని, తన కాన్వాయ్ లోని వాహానాలన్నీ ఫార్చ్యూనర్ లే అని క్లారిటీ ఇచ్చారు. బిజెపి తనపై చేసిన దాడిని సిపిఐ నేత, చికెన్ నారాయణ సమర్ధిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కమ్యూనిస్టు బిడ్డ నేనని పేర్కొన్న ఆయన ఇటువంటి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

కార్యకర్త వాహనం మీద నుండి పడిన ఘటనపై స్పందించిన నారాయణ

కార్యకర్త వాహనం మీద నుండి పడిన ఘటనపై స్పందించిన నారాయణ

నారాయణ వంటి నేతలు పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి పరాభవం తప్పదని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.

ఇక పువ్వాడ అజయ్ వాహనంపై డబ్బులు పంచుతున్నారు అన్న కారణంగా బీజేపీ నేతలు దాడి చేసిన ఘటనలో ఓ కార్యకర్త వాహనం పై నుండి కింద పడి పోయిన ఘటనపై సిపిఐ నేత నారాయణ స్పందించారు. వాహనం నుండి కింద పడిపోయిన కార్యకర్త చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ దాడి , నారాయణ వ్యాఖ్యలకు పువ్వాడ స్పష్టత

బీజేపీ దాడి , నారాయణ వ్యాఖ్యలకు పువ్వాడ స్పష్టత

పిరికివాడిలా పువ్వాడ పారిపోయారని ఇది టీఆర్ఎస్ పార్టీకి సిగ్గుచేటని విమర్శించారు . పువ్వాడ పై పోలీసు కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేశారు సి పి ఐ నారాయణ. ఇక నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో, నారాయణ వ్యాఖ్యలు తీరుతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు స్పష్టత ఇచ్చారు. తనపై బిజెపి కార్యకర్తలు హత్యాయత్నం చేశారని చెప్పుకొచ్చారు. నారాయణ విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.

English summary
BJP activists tried to kill him Minister Puvvada Ajay Kumar said . BJP activists attacked his convoy near the Forum Mall on his way to his medical college in Bachupally. Minister Puvvada fired back that BJP leaders had attacked him with the frustration of defeat. Puvvada also lashed out at CPI leader Narayana for supporting the BJP leaders' attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X