హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయన అప్పుడు ఉద్యమకారుడు.. ఇప్పుడు తుపాకి రాముడని పిలువాలి.. మంత్రి హరీష్‌రావు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Harish Rao Speech At Tupaki Ramudu Pre Release Event || సత్తిని పొగడ్తలతో ముంచెత్తిన హరీష్ రావు

యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై అందరి అభిమానాన్ని చూరగొంటున్న బిత్తిరి సత్తి హీరోగా తుపాకి రాముడు సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. టీ ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆదేశ్ రవి, పోషి లాంటి స్థానిక కళాకారులు నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో పలువురు రాజకీయ నేతల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, శ్రీనివాస యాదవ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..

 అంతా తెలంగాణ వారే

అంతా తెలంగాణ వారే

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా మారి సాహసం చేశాడు. తెలంగాణ ఉద్యమంలో ఓ సినిమా తీశాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరో సినిమా తీశాడు. నాకు ఈ సినిమా విషయంలో నాకు బాగా నచ్చిందేమిటంటే ప్రొడ్యూసర్ ఉద్యమ కారుడు, తెలంగాణ ఉద్యమకారుడు. దర్శకుడు టీ ప్రభాకర్ తెలంగాణవాది. హీరో బిత్తిరి సత్తి తెలంగాణ ప్రాంతపు వ్యక్తి. హీరోయిన్ ప్రియ తెలంగాణకు చెందిన కళాకారిణి. ఇలా తెలంగాణ వారితోనే సినిమా తీయడం చాలా ఆనందం అని మంత్రి హరీష్ రావు అన్నారు.

తెలంగాణ సంస్కృతితో

తెలంగాణ సంస్కృతితో

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయల నేపథ్యంగా తెరకెక్కిన తుపాకీ రాముడు చిత్రం కోసం ఎక్కడికో వెళ్లలేదు. తెలంగాణ పల్లెల్ని లొకేషన్లుగా ఎంచుకొని సినిమాను తెరకెక్కించారు. తెలంగాణ చెరువుగట్టు మీద తీశారు. బతుకమ్మ పండుగను గొప్పగా చూపించారు. అద్బుతమైన సందేశాన్ని టీ ప్రభాకర్, నిర్మాత రసమయి ఈ సినిమా ద్వారా అందించారు అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

సామాజిక సందేశంతో తుపాకి రాముడు

సామాజిక సందేశంతో తుపాకి రాముడు

తుపాకి రాముడు చిత్రాన్ని తెలుగు ప్రజలను ఆదరించాలని కోరుకొంటున్నాను. అద్బుతమైన సామాజిక సందేశంతో ఉన్న ఈ చిత్రాన్ని 100 రోజులు ఆడించాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నిర్మాత రసమయి మంచి టాలెంట్ ఉన్న కళాకారుడు. రవికుమార్ ఇప్పుడు మీకు తెలిసిన బిత్తిరి సత్తి. ఈ సినిమా రిలీజ్ తర్వాత తుపాకి రాముడు అవుతాడనే మంత్రి హరీష్ రావు అన్నారు.

రసమయిపై ప్రశంసలు

రసమయిపై ప్రశంసలు

ఇక నిర్మాత రసమయిపై హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారిడిగా, ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకొన్నారు. ఇక నిర్మాతగా మంచిగా రాణించాలి. నాలుగు పైసలు సంపాదించుకోవాలి. జీవితంలో ఇంకా బాగా ఎదగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.

English summary
Minister T Harish Rao gets emotional at Tupaki Ramudu pre release function. Minister Harish Rao, Srinivasa Yadav are the chief guest for This movie which held hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X