హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది?: ఉస్మానియా ఆస్పత్రి వరద నీటిపై మంత్రి తలసాని ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని పురాతన ఉస్మానియా ఆస్పత్రిలోకి మురుగు నీరు చేరుకోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఉస్మానియా ఆస్పత్రిలోకి నీళ్లు వచ్చినంత మాత్రాన నానా హంగామా చేస్తారా? అంటూ మడిపడ్డారు.

ఆనాడే కేసీఆర్ చెప్పారు..

ఆనాడే కేసీఆర్ చెప్పారు..

అంతేగాక, భారీగా కురుస్తున్న వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రి కూలితే బాధ్యులు ఎవరని ఆయన నిలదీశారు. 2015లోనే ఉస్మానియా ఆధునీకరిస్తామని కేసీఆర్ చెప్పారని మంత్రి తలసాని శ్రీనివాస్ గుర్తు చేశారు. పేదల కోసం 27 ఎకరాల్లో ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిస్తామంటే ప్రతిపక్షాలు అప్పుడు కోర్టువెళ్లాయని అన్నారు.

ప్రజల ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది?.. సుమోటోగా హైకోర్టు..

ప్రజల ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది?.. సుమోటోగా హైకోర్టు..

ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని ఉస్మానియా ఆస్పత్రి కేసును హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. తమ ప్రభుత్వానికి కోర్టుల మీద, చట్టం మీద గౌరవముందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక, ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రికి ఓ ప్రణాళిక ఉందని చెప్పారు.

సచివాలయంలో గుప్త నిధులా?: ప్రతిపక్షాలపై తలసాని ఆగ్రహం..

సచివాలయంలో గుప్త నిధులా?: ప్రతిపక్షాలపై తలసాని ఆగ్రహం..


తెలంగాణలో ఉన్న దరిద్రమైన ప్రతిపక్షాలు దేశంలో మరెక్కడా లేవని తలసాని దుయ్యబట్టారు. సచివాలయం భవనాల కింద గుప్త నిధులున్నాయంటూ రేవంత్ చేసిన ఆరోపణలు హాస్యాస్పదమని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై బుదరజల్లేందుకే ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ సందర్భంగా బీజేపీ నేతలపైనా తలసాని విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక డ్రామా.. హైదరాబాద్‌లో మరో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.

Recommended Video

#WATCH Newly Constructed Bridge Washed Away రూ.263 కోట్లు నీళ్ల పాలు,వరద ధాటికి కుప్పకూలిన బ్రిడ్జి!
పునరావృతం కానివ్వం..

పునరావృతం కానివ్వం..

ఉస్మానియా ఆస్పత్రిలోకి వరద నీరు రావడం ఇదే మొదటిసారి కాదని తలసాని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని మంత్రి తలసాని చెప్పారు. ఎంతో శ్రమించి జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వాటర్ వర్క్స్ ఉద్యోగులు వరద నీటిని బయటకు పంపించారని తెలిపారు. 24 గంటల కరెంటు మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని ఈ సందర్భంగా తలసాని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలోకి మురుగు నీరు భారీగా చేరుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో ప్రతిపక్షాలతోపాటు నెటిజన్లు కూడా ప్రభుత్వం, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
minister talasani srinivas yadav on osmania hospital rain water issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X