హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్ష ఇళ్ళు చూపిస్తానన్న ఛాలెంజ్.. భట్టి ఇంటికి వెళ్ళిన మంత్రి తలసాని.. ఇద్దరూ కలిసి ఒకే కార్లో ..

|
Google Oneindia TeluguNews

లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను , హైదరాబాద్ అభివృద్ధిని చూపించటంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సక్సెస్ అవుతారా ? భట్టీ విక్రమార్క విమర్శలకు చెక్ పెట్టటం కోసం భట్టీ ఇంటికి వెళ్ళిన ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలను తాము చెప్పిన అంశాలతో ఏకీభవించేలా చెయ్యగలరా ? సవాళ్లు , ప్రతిసవాళ్ళ మధ్య నేడు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలను స్వయంగా పరిశీలించటానికి వెళ్ళిన కాంగ్రెస్ , టీఆర్ఎస్ నాయకులు ఏమి చెప్తారు? అన్న ప్రశ్నలు తాజా పరిణామాలతో వ్యక్తం అవుతున్నాయి .

కూల్ న్యూస్ .. తెలంగాణాలో ఆ ఇళ్ళ నిర్మాణాలకు అనుమతి అక్కరలేదన్న సర్కార్కూల్ న్యూస్ .. తెలంగాణాలో ఆ ఇళ్ళ నిర్మాణాలకు అనుమతి అక్కరలేదన్న సర్కార్

 అసెంబ్లీ సాక్షిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణంపై విమర్శించిన భట్టీ విక్రమార్క

అసెంబ్లీ సాక్షిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణంపై విమర్శించిన భట్టీ విక్రమార్క


డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు మధ్య అసెంబ్లీ వేదికగా వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ? ఎంతమందికి ఇచ్చారు ? గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నందున ఇళ్లను పంపిణీ చేస్తామని అంటున్నారు అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సభా వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు.

 భట్టీ విక్రమార్క ఇంటికి వెళ్ళిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

భట్టీ విక్రమార్క ఇంటికి వెళ్ళిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

భట్టీ విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. రేపు తను స్వయంగా భట్టి విక్రమార్క ఇంటికి వెళ్ళి ఆయనను తీసుకెళ్లి లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల చూపిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. లక్ష ఇళ్లను చూపిస్తాం అంటే రావడానికి తాను సిద్ధమేనన్నారు భట్టి విక్రమార్క. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగగా నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లారు. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, హైదరాబాద్ అభివృద్ధిని చూపాలని భట్టి విక్రమార్క చేసిన సవాల్ కు జవాబివ్వడానికి ఆయన బట్టి ఇంటికి వెళ్లారు.

భట్టీ ఇంటివద్ద కాంగ్రెస్ , టీఆర్ఎస్ నేతలు

భట్టీ ఇంటివద్ద కాంగ్రెస్ , టీఆర్ఎస్ నేతలు

భట్టి విక్రమార్క ఇంటికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకోవడంతో వట్టి ఇంటికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ,టీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇటు టిఆర్ఎస్ పార్టీ మంత్రి తలసాని తో పాటుగా, మేయర్ రామ్ మోహన్, టిఆర్ఎస్ నేతలు నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను చూసేందుకు భట్టి విక్రమార్క తో కలిసి వెళ్లారు. భట్టి విక్రమార్క కూడా తలసాని కట్టిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడో చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. 70వేల కోట్లతో హైదరాబాదులో జరిగిన అభివృద్ధి ఎక్కడో చూస్తామని పేర్కొన్న భట్టి విక్రమార్క , రాత్రి కురిసిన వర్షాలకు నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని వాటిని కూడా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

Recommended Video

Telangana BAC Meeting : సెప్టెంబర్ 10న అసెంబ్లీలో రెవిన్యూ చట్టం పై కీలక ప్రకటన!
 ఒకే కార్లో ఇళ్ళ సందర్శనకు బయలుదేరిన భట్టీ , తలసాని .. సర్వత్రా ఆసక్తి

ఒకే కార్లో ఇళ్ళ సందర్శనకు బయలుదేరిన భట్టీ , తలసాని .. సర్వత్రా ఆసక్తి

భట్టి విక్రమార్క ఇంటి నుండి డబల్ బెడ్ రూమ్ ఇళ్లని చూడటం కోసం జియాగూడ కు తలసాని శ్రీనివాస్ యాదవ్, భట్టి విక్రమార్క ఇద్దరూ ఒకే కారులో బయలుదేరారు . ఇళ్ల పరిశీలన అనంతరం ఇరువురు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారని సమాచారం. అయితే అసెంబ్లీ వేదికగా కానీ, బయటగాని రాజకీయ నాయకులు సవాళ్లు చేసుకుంటే, వాటి నిరూపణకు ఎప్పుడూ ఎవరూ ప్రయత్నించరు. కానీ ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ ఆరోపణలకు చెక్ పెడుతూ, అధికార పార్టీ చేసిన అభివృద్ధిని చూపించడం కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లడంతో ఈ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది.

English summary
Minister Talsani Srinivas Yadav went to Bhatti's house today following an altercation between Bhatti Vikramarka and Talsani Srinivas Yadav over double bedroom houses. He was accompanied by a large number of TRS leaders. At the same time the Congress leaders went to Bhatti's house. Currently the leaders of both parties have gone to inspect the double bedroom houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X