• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మణికొండ డ్రైనేజీలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం... ఆ చెరువులో గుర్తించిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది..

|

హైదరాబాద్ మణికొండలో గత శనివారం(సెప్టెంబర్ 24) నాలాలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. గోల్డెన్ టెంపుల్ సమీపంలోని నెక్నాంపూర్ చెరువులో రజినీకాంత్ డెడ్‌బాడీని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. గాలింపు చర్యల్లో భాగంగా నెగ్నాంపూర్ చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తుండగా అతని మృతదేహం బయటపడింది. రజనీకాంత్ మృతి విషయం తెలిసి అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

మృతుడు గోపిశెట్టి రజనీకాంత్(42) షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.శనివారం రాత్రి 9గంటల సమయంలో పెరుగు ప్యాకెట్ కోసమని ఇంటి నుంచి బయటకెళ్లాడు. ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలో పడి గల్లంతయ్యాడు. రెండు రోజులుగా అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. చివరకు మణికొండ సమీపంలోని నెక్నాంపూర్ చెరువులో రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. డ్రైనేజీలో పడిన చోటు నుంచి 3కి.మీ మేర అతని మృతదేహం కొట్టుకొచ్చింది.

missing software engineers body found in a pond near manikonda in hyderabad

గతంలోనూ వర్షాల సమయంలో ఇలా డ్రైనేజీల్లో గల్లంతై మరణించిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.నగరంలో వర్షం పడుతుందంటే చాలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా రోడ్లపై వెళ్లే వాహనదారులు,పాదాచారులు మ్యాన్ హోల్స్‌ను గమనించి ముందుకెళ్లాలి. లేదంటే మ్యాన్ హోల్స్ మింగేసే ప్రమాదం ఉంది.ఒకరకంగా నగరంలోని మ్యాన్ హోల్స్ మృత్యు కుహారాలుగా తయారయ్యాయి.

తెలంగాణలో 14 జిల్లాలకు రెడ్ అలర్ట్,హైదరాబాద్‌లో హై అలర్ట్ :

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్‌, జనగామ, వరంగల్‌, హన్మకొండ, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ అయింది.

హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. నగరంలో సోమ,మంగళవారాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మరో మూడు రోజులు భారీ వర్ష సూచన ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. తుఫాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్‌ రూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏవైనా ఫిర్యాదులు లేదా సాయం కావాలంటే 040-23202813 నంబర్‌లో సంప్రదించవచ్చు.

English summary
The body of missing software engineer Rajinikanth was found in a pond last Saturday (September 24) in Manikonda, Hyderabad. Rajinikanth's dead body was found in the Neknampur pond near the Golden Temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X