హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

15 శాతమే.. పూర్తయిన కాళేశ్వరంను ఎలా ప్రారంభిస్తారు..ఎమ్మెల్యే భట్టి

|
Google Oneindia TeluguNews

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరింత విమర్శలను ఎక్కుపెట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన చర్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈనేపథ్యంలోనే ప్రాజెక్టు నిర్మాణంలో... నిజాలను పక్కన బెట్టి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకోసం విశ్రాంత ఇంజనీర్లను ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు.

కాగా 15 శాతం పూర్తయిన ప్రాజెక్టుకే 50వేల కోట్ల రుపాయాలు ఖర్చు పెడితే మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారాని ప్రశ్నించారు. మరోవైపు ప్రాజెక్టు యొక్క డీపీఆర్‌ను ప్రజల ముందు పెట్టాలని కోరుతున్న ప్రతిపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. ఈనేపథ్యంలోనే ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు నేరుగా చెప్పని ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్లతో అబద్దాలు ప్రచారం చేస్తుందని అన్నారు.

MLA Bhatti Vikramarka alleged that cm kcr propagating lies on Kaleshwaram project

15 శాతం కూడ పూర్తికాని ప్రాజెక్టును హడావిడిగా ప్రారంభించి భవిష్యత్‌లో రాష్ట్ర్ర ప్రజలు భారంగా మారుస్తున్నారని ఆరోపించారు. ఇక ప్రాజెక్టులో నిజానిజాలు బయటకు వస్తాయనే ప్రతిపక్ష పార్టీలను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వార 18 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరందిస్తామని చెబుతున్న సీఎం, ప్రారంభోత్సం తర్వాత కనీసం లక్ష ఎకరాలకైనా నీరందిస్తారా అని ప్రశ్నించారు.మరోవైపు ఉమ్మడి రాష్ట్ర్రంలో 70 శాతం పూర్తయిన సాగునీటీ ప్రాజెక్టులను పక్కన భట్టి రీ డిజైన్ పేరుతో ప్రజలపై సీఎం కేసీఆర్ భారం వేస్తున్నారని విమర్శించారు.

English summary
The Telangana Congress Party has been criticised construction of the Kaleshwaram Project. in this searies, MLA Bhatti Vikramarka criticized the government for its actions in the construction of the project. He alleged that cm kcr propagating lies on project .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X