హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాదాద్రికి దానం వితరణ: బంగారు తాపడం.. ఎంత అంటే

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పున:ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నరసింహా స్వామి భక్తులు/ నేతలు విరాళాలు ప్రకటిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఆ జాబితాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరిపోయారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం చేయడానికి తన వంతుగా కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తానని ఆయన ప్రకటించారు.

ఆధునిక చరిత్రలో ప్రజా పరిపాలకుడు ఇంత గొప్ప వైభవంగా ఒక ఆలయాన్ని పునర్నిర్మించడం ఒక అధ్భుతమని దానం నాగేందర్‌ పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కూడా యాదాద్రి ఆలయానికి కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన కుటుంబం, శ్రీని ఫార్మాగ్రూప్‌ కంపెనీ తరపున ఆలయానికి ఆందజేస్తామని తెలిపారు. ఒక గొప్ప సంకల్పానికి తాను ప్రేరణను, సంతోషాన్ని పొందానని తెలిపారు.

mla danam nagender donates kg gold to yadadri temple

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 28వ తేదీన పున:ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. ఇటు యాదాద్రిలో జర్నలిస్ట్‌లకు ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు అడిగినట్లు మోత్కుపల్లి నర్సింహులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ మేరకు ఇళ్ల స్థలాలలు కేటాయించే బాధ్యతను అప్పగిస్తూ మంత్రికి ఆదేశాలిచ్చారు.

Recommended Video

ఓటమి భయంతో మంత్రి కేటీఆర్ నియంత్రణ కోల్పోయారన్న చింతల

మంత్రి, కలెక్టర్‌, వైటీడీఏ అధికారులు చర్చించి.. ఎలా కేటాయించాలో చర్యలు తీసుకుంటారన్నారు. 'యాదాద్రి జర్నలిస్ట్‌ కాలనీ' అంటేనే గొప్పగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుందామన్నారు. క్షేత్రమెంత గొప్పగా బాగుంటుందో.. కాలనీ కూడా అంత గొప్పగా ఉండాలని.. దాంతో మనకు కారణంగా నిలుస్తుందన్నారు. జర్నలిస్టులు వార్తల వాహకులని.. ఆలయ నిర్మాణానికి సంబంధించి, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రం, ఆధ్యాత్మిక సంపదను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు క్షేత్రానికి సంబంధించిన ప్రత్యేక పరిశోధన వ్యాసాలు, కథనాలు రాయాలని మీడియా ప్రతినిధులను కోరిన సంగతి తెలిసిందే.

English summary
trs mla danam nagender donates kg gold to yadadri temple. reopened on 28th march of next year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X