హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టపాసుల బ్యాన్ పై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనం ..జీహెచ్ఎంసీ ఎన్నికలకు లింక్

|
Google Oneindia TeluguNews

దీపావళి టపాసుల నిషేధంపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాకర్స్ బ్యాన్ చేయాలని కోర్టుకు వెళ్లిన అడ్వకేట్ నుద్దేశించి సమయం ఇదేనా అంటూ ప్రశ్నించారు. దీపావళి ఎప్పుడు వస్తుందో ఆ అడ్వకేట్ కి తెలియదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీపావళి టపాసులు అమ్ముకోవడానికి తెచ్చుకున్న వ్యాపారులు ఇప్పుడు కేసులు వేసి బ్యాన్ చేయిస్తే ఎక్కడికి వెళ్లాలి అంటూ ప్రశ్నించారు. పోలీసులు రైడ్ చేసి టపాసులను అమ్మే వారి షాపులను మూసి వేయిస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

కాపులకు జగన్ దీపావళి కానుక ... జగన్ కు చంద్రబాబుకు తేడా ఇదే : ఏపీ మంత్రికాపులకు జగన్ దీపావళి కానుక ... జగన్ కు చంద్రబాబుకు తేడా ఇదే : ఏపీ మంత్రి

క్రాకర్స్ అమ్మకందారులు ఎటు పోవాలి ..చెప్పాలన్న రాజా సింగ్

క్రాకర్స్ అమ్మకందారులు ఎటు పోవాలి ..చెప్పాలన్న రాజా సింగ్

క్రాకర్స్ అమ్ముకునే దుకాణందారులు ఇప్పుడు ఎక్కడికెళ్లాలో చెప్పాలని , విక్రయాల కోసం కొనుగోలు చేస్తున్న టపాసులను ఎక్కడ స్టోర్ చేసుకోవాలో కూడా చెప్పాలని రాజా సింగ్ ప్రశ్నించారు. ఇళ్లల్లో పెట్టుకుంటే ఏదైనా జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యులు అంటూ నిలదీశారు. దీపావళి టపాసులు విక్రయాల కోసం అప్పులు తెచ్చుకొని మరీ షాపులు పెట్టుకున్న వారి పరిస్థితి ఏంటి అని అడిగిన రాజాసింగ్ దీపావళి ఎప్పట్లానే జరుగుతుందంటూ తేల్చి చెప్పారు.

 హిందువుల పట్ల ఇలాగే వ్యవహరిస్తే నిజామాబాద్ , దుబ్బాకలోలానే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు

హిందువుల పట్ల ఇలాగే వ్యవహరిస్తే నిజామాబాద్ , దుబ్బాకలోలానే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు


సీఎం కేసీఆర్ ఎంఐఎం మెప్పు కోసమే ఇదంతా చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు.

గోవులను వధించ వద్దని చట్టమే ఉందని, అయినా సరే గోవుల వధ జరుగుతోందని పేర్కొన్నారు పోలీసులు గోవధ విషయంలో ఎందుకు పెద్దగా స్పందించడం లేదంటూ ప్రశ్నించిన రాజాసింగ్ కేవలం హిందువుల పండుగల మీద , హిందువుల విషయంలోనే ఆంక్షలు ఎక్కువయ్యాయంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందువుల పట్ల ఇలాగే వ్యవహరిస్తే నిజామాబాద్ , దుబ్బాక లో ఏం జరిగిందో రేపు జిహెచ్ఎంసి లోనూ అదే జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.

Recommended Video

తెలంగాణలో పటాకులు కాల్చొదన్న హైకోర్టు తీర్పుతో చాలామంది నష్టపోతారు: రాజాసింగ్
 క్రాకర్స్ బ్యాన్ .. పలు రాష్ట్రాల నిర్ణయం .. ఆగ్రహిస్తున్న హిందువులు

క్రాకర్స్ బ్యాన్ .. పలు రాష్ట్రాల నిర్ణయం .. ఆగ్రహిస్తున్న హిందువులు

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు దీపావళి సందర్భంగా టపాసుల విక్రయాలపై నిషేధం విధించాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ బాణసంచా అమ్మకాలపై కాలుష్యం కారణంగా కోర్టు నిషేధం విధించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ రోజు కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు కాల్చుకునేలా పరిమితి విధించింది ఏపీ సర్కార్. కరోనా వ్యాప్తి నేపథ్యంగా తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది హిందూత్వవాదులకు నచ్చటం లేదు. ఆ కారణంగానే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు .

English summary
BJP MLA Rajasingh has expressed anger over the ban on Diwali crackers. The advocate, who went to court to ban the crackers, asked if it was time. He expressed impatience that the Advocate did not know when Diwali was coming. Traders who used to come to sell Diwali crackers where to go if banned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X