హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్థరాత్రి హైడ్రామాలో ఏం జరిగింది..? ఎమ్మెల్యే రాజాసింగ్ తల ఎలా పగిలింది

|
Google Oneindia TeluguNews

పోలీసుల లాఠీచార్జ్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గాయాలు అయ్యాయి. బుధవారం ఆర్థరాత్రీ హైదరాబాద్‌లోని జుమ్మెరాత్ బజార్‌లోని స్వతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతి భాయ్ విగ్రహా ప్రతిష్టాపన చేసేందుకు కొంతమంది స్థానికులు ప్రయత్నించారు. అయితే విగ్రహా ప్రతిష్టాపనకు ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో గోషామహాల్ పోలీసులు రంగంలోకి దిగారు.

ఇక విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్న స్థానికులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాజాసింగ్ వచ్చిన అనంతరం అప్పటికే పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు నిరసనగా పోలీసులపై రాళ్లు రువ్వారు. అయితే వీరిని చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసుల లాఠీచార్జీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు పలువురు స్థానికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

MLA Raja Singh suffered serious head injuries after the police resorted to lathi charge

కాగా అక్రమంగా లాఠీచార్జీ చేసిన పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఒక స్వాతంత్ర్య సమరయోధురాలి విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఈఘటనపై డీజీపీకి పిర్యాధు చేస్తానని అన్నారు.

English summary
Goshamahal MLA and BJP leader Raja Singh suffered serious head injuries after the police resorted to lathi charge on him at Jumerat Bazar in the city here late on Wednesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X