హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు చోట్ల ఓటేసిన ఎమ్మెల్సీ కవిత .. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు .. క్లారిటీ ఇచ్చిన ఎస్ఈసి

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఓటు వేయడం పెద్ద వివాదంగా మారింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉన్నారని, ఆమెకు బోధన్ నియోజకవర్గ పరిధిలో ఓటు ఉందని అసెంబ్లీ ఎన్నికలలో అక్కడినుంచి ఓటు హక్కును వినియోగించుకున్నారు అని పేర్కొంటూ, మళ్లీ గ్రేటర్ హైదరాబాద్ లో ఎలా ఓటు హక్కు వినియోగించుకుంటారు అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. రెండు చోట్ల కవిత ఓటు ఎలా వేస్తారు అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ముగిసిన గ్రేటర్ పోలింగ్ .. ఓటింగ్ ను లైట్ తీసుకున్న గ్రేటర్ ఓటర్లు .. కారు గుర్తు హైలెట్ చేశారని బీజేపీ ఫిర్యాదు ముగిసిన గ్రేటర్ పోలింగ్ .. ఓటింగ్ ను లైట్ తీసుకున్న గ్రేటర్ ఓటర్లు .. కారు గుర్తు హైలెట్ చేశారని బీజేపీ ఫిర్యాదు

కేటీఆర్ గ్రేటర్ లో ఓటేసినా కవితనే టార్గెట్ చేసిన బీజేపీ

కేటీఆర్ గ్రేటర్ లో ఓటేసినా కవితనే టార్గెట్ చేసిన బీజేపీ

ఎమ్మెల్సీ కవిత పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ బీజేపీ అధికారికంగా లేఖను కూడా పంపింది.

బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా హైదరాబాద్లోనూ కవితకు ఓటు హక్కు ఉందన్న రికార్డుల్ని తమ లేఖతో పాటు జత చేసి ఫిర్యాదును సమర్పించారు బిజెపి నేతలు. అయితే ఒక్క కవిత మాత్రమే కాకుండా, కేటీఆర్ కూడా సిరిసిల్ల నుండి ఓటు హక్కును వినియోగించుకునే వారు. ఆయన కూడా ఈసారి గ్రేటర్ ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. అయితే కేటీఆర్ ని కాకుండా, కవిత ను మాత్రమే టార్గెట్ చేస్తున్న బీజేపీ కవిత పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది .

రెండు చోట్ల ఓటు హక్కు అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కవితపై ఫిర్యాదు

రెండు చోట్ల ఓటు హక్కు అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కవితపై ఫిర్యాదు

ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో బంజారాహిల్స్ చిరునామాతో మరోసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు అని, గతంలో కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు బోధన్ అసెంబ్లీలో నియోజక వర్గంలో తనకు ఓటు ఉందని పేర్కొన్నారని ఫిర్యాదు లేఖలో పేర్కొంది బిజెపి. అంతేకాదు నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను. మీరు బయటకు వచ్చి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి లేఖలో ప్రస్తావించారు.

 నిజామాబాద్ లో ఓటు రద్దు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత

నిజామాబాద్ లో ఓటు రద్దు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత

తాజాగా కవిత ఓటింగ్ వివాదంపై రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది గతేడాది నిజామాబాద్లో ఓటు వేసి ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఓటు వేశారని బీజేపీ ఫిర్యాదు మేరకు ఎస్ఈసి క్లారిటీ ఇచ్చింది. కవిత నిజామాబాద్ లో ఓటుహక్కును రద్దు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అందుకే కవిత గ్రేటర్ హైదరాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొంది.

మొత్తానికి గ్రేటర్ ఎన్నికల సమయంలో బీజేపీ మాత్రం టీఆర్ఎస్ నేతల ఏ చిన్న తప్పు దొరికినా దానిని హైలెట్ చేస్తుంది. కానీ అధికార పార్టీ స్మార్ట్ గా తప్పించుకుంటుంది .

English summary
KCR's daughter Kalvakuntla kavitha cast her vote in the Greater Hyderabad Municipal Corporation elections has become a big controversy. BJP leaders questioned how the right to vote was exercised again in Greater Hyderabad, claiming that Nizamabad MLC Kalvakuntla Kavitha had exercised his right to vote in the Assembly elections from Bodhan constituency of Nizamabad district. Two places complained to the Electoral Commission about how the kavitha was cast her vote . The state election commission clarified that kavitha's vote was canceled in Nizamabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X