హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనర్హత కరెక్టే : ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ చర్యను సమర్థించిన హైకోర్టు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాములు నాయక్, యాదవరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని మండలి చైర్మన్ రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో వారికి హైకోర్టులో ఊరట కలుగలేదు. తమ అభ్యర్థిత్వాలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.

పిటిషన్ కొట్టివేత
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవరెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై టీఆర్ఎస్ఎల్పీ ఫిర్యాదు మేరకు శానస మండలి చైర్మన్ చర్యలు తీసుకున్నారు. వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. తమపై అనర్హత చెల్లదని వారిద్దరూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తమపై మండలి చైర్మన్ చట్టవిరుద్దంగా అనర్హత వేటు వేశారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణను హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారించింది. అనర్హత వేటుకు సంబంధించి పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది.

mlcs disqualify are correct says high court

రాములు నాయక్, యాదవరెడ్డి పిటిషన్లను కొట్టివేసింది. మండలి ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా లేవని తేల్చిచెప్పింది. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పిటిషన్ తరఫు న్యాయవాదులు తెలిపారు. అయితే అప్పటివరకు ఎన్నికలు నిర్వహించవద్దని వారు హైకోర్టును కోరారు. దీనిని ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. పిటిషనర్ల అభ్యర్థనను ఎన్నికల దృష్టికి తీసుకెళ్లాలని ఈసీ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది.

English summary
Ramulu Naik and Yadavreddy were spotted in the High Court. The High Court made it clear that the decision to cancel the MLC nomination was made by the chairman of the council. This did not bring them to the High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X