రైళ్లఢీ ప్రమాదంలో డ్రైవర్ పరిస్థితి విషమం: 30 మందికి పైగా గాయాలు: మూడు కోచ్ లు ధ్వంసం..!
కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన రైళ్ల ఢీ ప్రమాదంలో ఎంఎంటీయస్ డ్రైవర్ శేఖర్ పరిస్థితి విషమంగా ఉంది. కాచిగూడ రైల్వే స్టేషన్ నింబోలి అడ్డ వద్ద ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును ఓ ఎంఎంటీఎస్ రైలు ఢీకొంది. హంద్రీ ఎక్స్ ప్రెస్ రైలు కాచిగూడ స్టేషన్ వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉంది. అయితే సిగ్నల్ లోపం వల్ల అదే ట్రాక్‌పై ఎంఎంటీఎస్ రైలు వచ్చింది. హంద్రీ ఎక్స్ ప్రెస్ రైలును వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఎంఎంటీఎస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రైళ్లు ఢీకొన్న ఘటనలో 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆగివున్న ఉన్న ప్యాసెంజర్ (ఇంటర్‌సిటీ) రైలు ట్రాక్‌పైకి ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్‌లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. స్టేషన్ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు వెల్లడించారు.
కాచిగూడలో రైలు ప్రమాదం.. పాసింజర్ రైలును ఢీకొట్టిన ఎంఎంటీఎస్

డ్రైవర్ పరిస్థితి విషమం..ఫలించని ప్రయత్నాలు..
కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో హంద్రీ ఎక్స్ ప్రెస్ రైలు కాచిగూడ స్టేషన్ వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉండగా..అదే సమయంలో సిగ్నల్ లోపం వల్ల అదే ట్రాక్‌పై ఎంఎంటీఎస్ రైలు వచ్చింది. చిలుకూరు-కాగజ్‌నగర్ ప్యాసింజర్ రైలును వెనుక నుండి ఢీ కొట్టింది. ఆ సమయంలో పైలెట్ ఉన్న భాగం బలంగా రైలును ఢీకొంది. దీంతో..పైలెట్ గా ఉన్న శేఖర్ రెండు రైళ్ల మధ్య ఇంజన్ భాగంలో చిక్కుకు పోయారు. కాపాడాలంటూ అర్తనాదానలు చేసాడు. డ్రైవర్ ను బయటకు తీసేందుకు అనేక రకాలుగా ప్రయత్నించినా..అవి ఫలించలేదు. రెండో ట్రాక్ లోకి వెళ్లాల్సిన రైలు సిగ్నల్ లోపం కారణంగా నాలుగో ట్రాక్ లోకి వచ్చింది. దీంతో..వేగం తక్కువగా ఉన్న ఢీ కొన్న సమయంలో ఇంజన్ వద్ద డ్రైవర్ చిక్కుకుపోయారు. అక్కడే తాత్కాలికంగా ఆక్సిజన్ సదుపాయం సైతం కల్పించారు. కానీ, డ్రైవర్ శేఖర్ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

30మందికి పైగా గాయాలు..
ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిని కాచిగూడ స్టేషన్ సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఆ తరువాత వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా సిగ్నల్ వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. స్టేషన్ సమీపంలో ఇంటర్ సిటీ రైలు ఆగి ఉండగా..అదే ట్రాక్ మీదకు ఎంఎంటీయస్ రైలు వచ్చింది. గ్రీన్ లైట్ రావటంతో అదే లైన్ లోకి ఎంఎంటీయస్ రైలు వచ్చింది. అయితే, పట్టాలు మారాల్సి ఉన్నప్పటికీ..ట్రాక్ మీద ముందుకు వెళ్లేందుకు సాంకేతికంగా గ్రీన్ సిగ్నల్ ఉండటంతో స్టేషన్ లోకి మరో కొద్ది సెకన్లలోకి చేరుకొనే సమయంలో ఆకస్మికంగా ఎదురుగా ఆగి ఉన్న రైలు కనిపించింది. కానీ, అప్పటికే నియంత్రణ లేకుండా పోయింది .దీంతో.. ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలును ఎంఎంటీయస్ రైలు ఢీ కొట్టి..మూడు కోచ్ లు ధ్వంసం అయ్యాయి.
ఆరు కోచ్ లు పట్టాలపైన పడిపోయాయి.

పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
రెండు రైళ్ల ఢీ ఘటనతో కాచిగూడ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసారు. కాచిగూడ నుండి కర్నూలు వెళ్లే రైలును దారి మళ్లించారు. దీంతో పాటుగా కాచిగూడ మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను నిలిపివేయటంతో పాటుగా..తాత్కాలికంగా ఎంఎంటీయస్ రైళ్ల సర్వీసును రద్దు చేసారు. మరి కొన్ని దారి మళ్లించారు. ఫలక్ నుమా నుండి సికింద్రాబాద్ వెళ్లే అన్ని ఎంఎంటీయస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసారుద. ఘటనా స్థలికి రైల్వే అధికారులు చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రాధమికంగా ఇది సాంకేతిక సమస్య కారణంగా జరిగిందని చెబుతన్నా..లోతుగా విచారణ చేస్తున్నారు. స్టేషన్ సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్థానిక ప్రజాప్రతినిధులు పరామర్శించేందుకు చేరుకుంటున్నారు.