హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మల్టీ నేషనల్ కంపెనీని నిలువునా ముంచిన సైబర్ నేరగాడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టెక్నాలజీ మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తోంది. ఒక్క క్లిక్ లోనే సమస్త సౌకర్యాలు అందుబాటులోకి తెస్తోంది. ఇది నాణేనికి ఒకవైపైతే మోడ్రన్ టెక్నాలజీ మనిషి కష్టాలు మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో భద్రత అనేది లేకుండా చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు సాధారణ వ్యక్తుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు ఆర్థికంగా దోచుకుంటున్నారు. చేతివాటం ప్రదర్శిస్తూ జనాల డబ్బులు కొల్లగొడుతున్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిథిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ హ్యాకర్ చేతివాటం ప్రదర్శించి ఓ కంపెనీకి 8.64 కోట్ల రూపాయలు స్వాహా చేశాడు.

మెయిల్ హ్యాక్ చేసి
కొండాపూర్ లోని వోల్టా ఎంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హ్యాకింగ్ కారణంగా కోట్ల రూపాయలు పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఎగుమతి చేసే ఈ కంపెనీ ఆఫ్రికాలోని డైమెండ్ సిమెంట్ కంపెనీతో తరుచూ లావాదేవీలు జరుపుతుంటుంది. ఈ ట్రాన్స్సాక్షన్స్ కు సంబంధించి డైమండ్ సిమెంట్ ఉద్యోగి అయిన తమిళ్ వెన్నంతో వోల్టా ఇంప్లేక్స్ కు చెందిన మురళీ కృష్ణ నిత్యం టచ్ లో ఉంటారు.

రియల్ ఎస్టేట్, పెళ్లిళ్లు, ఉద్యోగాలు.. మాటలే పెట్టుబడిగా కోటిన్నర మాయంరియల్ ఎస్టేట్, పెళ్లిళ్లు, ఉద్యోగాలు.. మాటలే పెట్టుబడిగా కోటిన్నర మాయం

తాము ఎగుమతి చేసిన ఉత్పత్తులకు సంబంధించిన లావాదేవీల్లో భాగంగా పేమెంట్స్ కు సంబంధించి మురళీకృష్ణ డైమెండ్ సిమెంట్ తో మెయిల్ లు పంపుతూ ఉంటాడు. 2018 డిసెంబర్ లోనూ మురళీకృష్ణ ఇలానే ఓ మెయిల్ పంపాడు. కానీ దానికి డైమెండ్ సిమెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో మురళీకృష్ణ ఆ కంపెనీకి చెందిన మరో ఉద్యోగిని సంప్రదించగా. తాము రూ.8.64 కోట్లు పంపినట్లు చెప్పడంతో మురళీకృష్ణ షాకయ్యాడు.

MNC loses Rs 8.64 crore to cyber crooks

ఫేక్ మెయిల్ పంపి డబ్బు స్వాహా
కంపెనీ అకౌంట్ లో డబ్బు జమ కాకపోవడంతో మురళీకృష్ణ సదరు లావాదేవీకి సంబంధించి డైమెండ్ సిమెంట్స్ కంపెనీని వివరాలు అడిగాడు. వారు బ్యాంక్ ఆఫ్ అమెరికా అకౌంట్ కు అమౌంట్ పంపినట్లు చెప్పారు. అయితే తామిచ్చిన ఆంధ్రా బ్యాంక్ నంబర్ కు కాకుండా వేరే అకౌంట్ కు డబ్బులు ఎందుకు పంపారని అడగగా.. బ్యాంక్ ఆఫ్ అమెరికా అకౌంట్ కు అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేయమంటూ వోల్టాల్ కంపెనీ నుంచి తమకు వచ్చిన మెయిల్ ను పంపారు. అది చూసిన మురళీకృష్ణ సైబర్ నేరగాళ్లు ఆఫీస్ మెయిల్ హ్యాక్ చేసి డబ్బు కొట్టేశారని గుర్తించారు. కంపెనీ ఫైనాన్షియల్ కంట్రోలర్ పద్మనాభరావు ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A multi-national company located in Hyderabad has fallen prey to cyber crooks who, by sharing details of their “new” bank account via a spoof email id of the company’s client from West Africa, siphoned off 8 crore from the company. According to sources, the company, which has multiple branches across the globe, also has a branch in Madhapur. They are into the import and export of tools and do business with an Africa-based client. Recently, the city-based company was about to finalise a deal worth 8 crore to purchase the material.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X