హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

30 ఏళ్ల జైలు: లైంగికదాడి కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

|
Google Oneindia TeluguNews

నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. లైంగిక దాడి కేసులో నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో హోంగార్డ్‌ మల్లికార్జున్‌కు నాంపల్లి కోర్టు జైలుశిక్ష విధించించింది. దాంతో పాటు బాధితురాలి కుటుంబానికి 40 వేల రూపాయలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఫిబ్రవరిలో తుకారాంగేట్‌ వద్ద మైనర్‌ బాలికపై హోంగార్డు మల్లికార్జున్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 19న హోంగార్డు మల్లికార్జున్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం బాలిక గర్భం దాల్చడంతో.. మెడికల్‌ రిపోర్ట్స్‌ నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ వరకు.. అన్ని ఆధారాలు సేకరించారు. వాటిని కోర్టులో సమర్పించారు.

molestation minor girl nampally court sentenced home guard 30 years

ఈ ఏడాదితో ఫిబ్రవరిలో తమ కూతురిపై హోంగార్డ్ మల్లికార్జున్ లైంగిక దాడికి పాల్పడ్డాడని తుకారాంగేట్ కి చెందిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను వైద్యపరీక్షలు చేయించారు. రిపోర్ట్స్ లో బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడైంది. మెడికల్‌ రిపోర్ట్స్‌ నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ వరకు అన్ని ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లి న్యాయస్థానం నిందితుడు మల్లికార్జున్ కు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Recommended Video

Sudarshan Prasad Tiwari About Congress Veteran M Satyanarayana Rao

ఆధారాలు అన్నింటిని కోర్టు పరిశీలించింది. నిందితుడు మల్లికార్జున్‌కు 30 ఏళ్ల జైలుశిక్ష విధించింది. బాధితురాలి కుటుంబానికి రూ.40 వేలు చెల్లించాలని ఆదేశించింది. పోలీస్ శాఖలో పనిచేస్తూ.. ఇలా చేయడంపై ఆగ్రహాం వ్యక్తం అయ్యింది. పోలీస్ పేరుతో ఏం చేసినా నడుస్తోందని అనుకుంటే చెల్లదు.

English summary
molestation a minor girl hyderabad tukaramgate. nampally court sentenced home guard 30 years prison term.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X