హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో .. సులభ్‌ కాంప్లెక్స్‌లో నగదు మార్చిన ముఠా! : ఏటీఏం చోరీ కేసులో వెలుగులోకి వాస్తవాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కేటుగాళ్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. రోడ్డుపై నడుస్తోన్న వ్యక్తుల నుంచి నగదు, నగలే కాదు ... ఏటీఎం మిషన్లను కూడా ఎత్తుకెళ్తున్నారు. ఇటీవల దిల్ షుఖ్ నగర్ లో ఏటీఎంలో నగదు మిషన్ ను ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ కేసు విచారణకు పోలీసులు వేగవంతం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మీడియాకు తెలిపారు.

ఏటీఎం పెట్టే చోరీ ..
ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లో ఏటీఏం పెట్టే చోరీకి గురైంది. ఈ కేసు విచారణను పలు విధాలుగా పరిశోధిస్తున్నారు పోలీులు. విచారణలో ఆటో దిగిన ఇద్దరు దుండగులు సంచిని కొనుగోలు చేసి అక్కడి నుంచి సులభ్‌ కాంప్లెక్స్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అంతేకాదు ఇద్దరు వ్యక్తులు రూ.500 పడిపోయినట్లుగా సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్వహించే నిర్వాహకుడి దృష్టి మళ్లించగా.. మరో ఇద్దరు దుండగులు లోపలికి వెళ్లి పెట్టెలో ఉన్న నగదును సంచిలోకి మార్చినట్లు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి బస్సు ఎక్కి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కడికి వెళ్లారు ? ఎవరెవరు వెళ్లారనే అంశంపై విచారిస్తున్నామని పేర్కొన్నారు.

money exchange in sulabh complex

ముమ్మరంగా గాలింపు
దీంతో సిటీ లోని అన్ని ప్రధాన మార్గాల్లో సీసీ కెమెరాల్లో పరిశీలిస్తుండగా.. నాలుగు ప్రత్యేక బృందాలు తమిళనాడులోని రాంజీనగర్‌ ప్రాంతంలో దుండగుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. నగదు పెట్టెలోని రూ.2000, రూ.500 నోట్లపై వరుస క్రమాలను పోలీసులు తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో కూడా విచారించారు. చోరీకి పాల్పడింది రామ్‌, మొతిరన్, దీపు, బీస్మార్‌ గా పోలీసులు భావిస్తున్నారు. వీరేనా .. వీరికి స్థానికంగా ఎవరైనా సహకారం అందించారా అనే కోణంలో విచారిస్తున్నారు. ఎంక్వైరీ ఆధారంగా తమ తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

వదిలేది లేదు

నగదు చోరీచేసిన దొంగల కోసం వేట సాగుతోందని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. దొంగలను పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు. బీహార్ దొంగల ప్రమేయం కూడా ఉందా అనే కోణంలో తమ విచారణ జరగుుతోందని తెలిపారు.

English summary
At ATM in Dilsukhnagar, The police are investigating the case in several ways. Two of the auto rickshaws in the trial were found to have purchased a bag and went to the Sulabh Complex. two people have gone to the eye of the manager of the Sulab complex, as two people have fallen below Rs.500. Two other thugs go inside and deposit the cash in the box.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X