• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమ్మ ప్రేమ: తీవ్ర రక్తస్రావంలో కూడా బిడ్డ ఆకలిని తీర్చిన తల్లి..ఫోటో వైరల్

|
  Viral Photo : Monkey Feeds Her Baby After Hit By A Vehicle !

  అదొక అటవీప్రాంతం. రోడ్డుపైన జంతువులు నిత్యం తిరుగుతూ ఉంటాయి. రోడ్డుకు ఇరువైపుల దాటుతూ కనిపిస్తాయి. పగలుపూట కోతులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. రాత్రివేళల్లో ప్రమాదకరమైన మృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన కథలో ఉన్న అటవీ ప్రాంతం సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నుంచి హైదరబాదు వెళ్లే హైవేపై ఉంది. గుమ్మడిదల గ్రామ శివారు నుంచి ఈ అటవీ ప్రాంతం ప్రారంభం అవుతుంది.

  ఆకలితో సంచరిస్తున్న కోతిని వేగంగా వచ్చి ఢీకొన్న వాహనం

  ఆకలితో సంచరిస్తున్న కోతిని వేగంగా వచ్చి ఢీకొన్న వాహనం

  అటవీ ప్రాంతాన్ని చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. వారితో పాటు తీసుకొచ్చుకున్న ఆహార పదార్థాలు అక్కడి కోతులకు లేదా కనిపించిన ఇతర జంతువులకు వేస్తుంటారు. అలా ఆకలితో అలమటిస్తూ తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని ఈ హైవేపై ఓ కోతి రోడ్డుపై తన బిడ్డతో సంచరిస్తోంది.కోతి ఇలా రోడ్డుపై ఆహారం కోసం తచ్చాడుతుండగా అతి వేగంతో వచ్చిన ఓ వాహనం ఢీకొంది. వాహనం ఢీకొనడంతో తల్లి కోతి ఒకవైపు పిల్ల కోతి మరోవైపు పడిపోయాయి. తల్లి కోతికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం జరిగింది.

  బిడ్డ కోసం వెతికి పాలిచ్చి ఆకలి తీర్చిన కోతి

  బిడ్డ కోసం వెతికి పాలిచ్చి ఆకలి తీర్చిన కోతి

  మరో వైపు పడ్డ పిల్ల కోతి మాత్రం ప్రాణాలతో బయటపడింది. అయితే తల్లి ప్రేమ ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. రక్తం కారుతున్నప్పటికీ తన పరిస్థితి ఏంటో గ్రహించక బిడ్డ కోసం తాపత్రయపడింది. బిడ్డ ఎక్కడుందో కాసేపు వెతికింది. బిడ్డ తన కంటికి కనపడగానే ఆ తల్లి కోతికి గాయం ద్వారా కలిగిన నొప్పిని మర్చి పోయింది. వెంటనే పిల్లకోతిని గుండెలకు హత్తుకుంది. ఆకలితో ఉన్న తన బిడ్డకు పాలిచ్చింది. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆకలితో ఉన్న తన బిడ్డకు పాలిస్తున్న తల్లి కోతిని చూసిన పలువురు కంటతడి పెట్టారు. ఈ ఫోటోను తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజెన్లు సైతం కదిలిపోయారు. తల్లి ప్రేమ అంటే ఇదేనేమో.. ఈ ప్రేమను ఒక తల్లి తప్ప మరెవరూ ఇవ్వలేరని కామెంట్స్ రాశారు.

  గతంలో ఓ కోతి కరెంట్ షాక్‌కు గురైతే కాపాడిన మరో కోతి

  గతంలో ఓ కోతి కరెంట్ షాక్‌కు గురైతే కాపాడిన మరో కోతి

  గతంలో కూడా కాన్పూర్ రైల్వే స్టేషన్‌లో కోతులు సంచరిస్తుండగా అందులో ఒక కోతి కరెంట్ షాక్‌కు గురై రైల్వే పట్టాలపై స్పృహ లేకుండా పడిపోయింది. ఇది గమనించిన మరో కోతి వెంటనే పరుగులు తీసి దాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. కోతి ప్రాణాలు కాపాడేందుకు ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేసింది. ఈ దృశ్యాన్ని ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులు తమ కెమెరాలో బంధించారు. మొత్తానికి షాక్ తగిలి పడిపోయిన కోతి ఎట్టకేలకు తిరిగి లేచి అడుగులు వేయడంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు.

  English summary
  A monkey was badly hurt by an unidentified vehicle in the forest area of Sangareddy. Thought it was bleeding heavily it did not forget to feed her baby. This was captured by few tourists who visited that place is now making rounds in social media
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X