హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోతి మామ బట్టలు ఉతికిిందిగా.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరుగా..! (FUNNY VIDEO)

|
Google Oneindia TeluguNews

Recommended Video

కోతి పనులు చేయకురా వెధవ.. బట్టలుతికే కోతిని చూస్తే ఇకపై అలా అనరేమో (వీడియో)

హైదరాబాద్ : కోతి పనులు చేయకురా వెధవ అని సాధారణంగా ఇంట్లో పిల్లల్ని పెద్దలు మందలిస్తుంటారు. చేయకూడని పనులు చేస్తూ పెద్దల్ని ఇబ్బందిపెట్టే పిల్లల విషయంలో ఇలాంటి డైలాగులు కామన్‌గా వినిపిస్తుంటాయి. కోతి చేష్టలు మానుకోరా నాయనా అంటూ దోస్తానాలో కూడా నవ్వులు పూయించే ఘటనలు ఉంటాయి. కానీ ఈ మంకీ వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా ఇకపై అలాంటి మాటలు వాడారేమో.

కోతి నుంచే మనిషి పుట్టుక వచ్చిందంటారు. ఆ క్రమంలో ఎవరైనా ఫన్నీ చేష్టలు చేస్తేనో.. సరాదాగా ఆట పట్టిస్తేనో.. కోతి పనులు చేయకురా అనే మాటలు తరచుగా వస్తుంటాయి. ఇంట్లో పిల్లల విషయంలోనైనా.. స్నేహితుల మధ్యనైనా ఇలాంటి మాటలంటూ ఆటపట్టిస్తూనే ఉంటారు. అయితే ఈ ఫన్నీ వీడియోలో సదరు కోతి మామ గారు చేసిన సందడి చూస్తే అలాంటి మాటలను వెనక్కి తీసుకుంటారేమో. ఎందుకంటే ఈ కోతి మనుషుల కన్నా బాగా పనిచేస్తోంది మరి.

monkey washing clothes viral video

పోలీస్ పేరుతో బెదిరింపులు.. ఆర్ఎంపీ డాక్టర్ లీలలు.. యువతులపై అత్యాచారం..!పోలీస్ పేరుతో బెదిరింపులు.. ఆర్ఎంపీ డాక్టర్ లీలలు.. యువతులపై అత్యాచారం..!

నగరాల్లో ఐతే ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్లు ఉంటాయి. బట్టలు ఉతకడం చాలా ఈజీ. ఇక గ్రామాల్లో బట్టలు ఉతకాలంటే బండకేసి కొట్టడమే. ఏ పల్లెలో చూసినా ఇలాంటి సీన్లు పుష్కలంగా కనిపిస్తాయి. అయితే సేమ్ సీన్ ఈ వీడియోలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనుషులు బట్టలు ఉతకడం లేదు.. కోతి మామ బట్టలు ఉతుకుతోంది. కొన్ని బట్టలు తీసుకుని బండకేసి దబాదబా బాదేసింది. అచ్చు మనుషులు ఉతికినట్లే ఉతికేసింది. మధ్యమధ్యలో నీళ్లల్లో ముంచుతూ తిరిగి బండకేసి బాదింది.

ఈ వీడియోలో కోతి మామ చేసిన హంగామా చూస్తే ఎవరైనా సరే నవ్వు ఆపుకోలేరు. అంత బాగా బట్టలు ఉతికేసింది కోతి మామ. ఈ వీడియో ఎవరు తీశారో, ఎక్కడ తీశారో తెలియకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ కోతి మామ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సూపర్ వాష్ కోతి మామ అనిపించుకుందిగా.

English summary
Cities have washing machines in every home. Washing clothes is very easy. In the villages, the clothes are washed manually. Same Scene appears in this video, however. But there is no human washing clothes here. The monkey is washing the clothes. A funny video viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X