హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడ్ ఆఫ్ ది నేషన్: వైసీపీ, టీఆర్ఎస్ సహా దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలదే హవా

|
Google Oneindia TeluguNews

విజయవాడ/హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లోకసభ సీట్లు వస్తాయని ఇండియా టుడే - కార్వీ ఇన్‌సైట్స్ 'మూడ్' ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది.

కాంగ్రెస్ కూటమిలో టీడీపీ, ఇతరుల్లో టీడీపీ, వైసీపీ

కాంగ్రెస్ కూటమిలో టీడీపీ, ఇతరుల్లో టీడీపీ, వైసీపీ

ఎన్డీయేలో బీజేపీ, ఆల్ ఇండియా ఎన్ రంగస్వామి కాంగ్రెస్, అప్నాదళ్, బోడో పీపుల్స్ ఫ్రంట్, డీఎండీకే, జేడీయు, ఎల్జేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, పీఎంకే, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆర్పీఐ(ఏ), అకాలీదళ్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, శివసేనలను, యూపీఏలో కాంగ్రెస్, డీఎంకే, జేడీఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, జేఎంఎం, కేరళ కాంగ్రెస్(మణి),జేయూఎంఎల్, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆర్ఎల్డీ, టీడీపీలు ఉన్నాయి. ఇతరుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, అన్నాడీఎంకే, టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, పీడీపీ తదితర పార్టీలు ఉన్నాయి.

ఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమే, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు? వీరు కలిస్తే చుక్కలేఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమే, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు? వీరు కలిస్తే చుక్కలే

టీఆర్ఎస్, వైసీపీలదే హవా

టీఆర్ఎస్, వైసీపీలదే హవా

గతంలో వచ్చిన సర్వేల్లో, తాజాగా వచ్చిన సర్వేల్లో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి పదహారు లోకసభ స్థానాలు వస్తాయని చెబుతున్నాయి. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 19 స్థానాలు వస్తాయని చెబుతున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే 19 వరకు సీట్లు, లేదంటే 13 వరకు రావొచ్చునని గత సర్వేల్లో తేలాయి. ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ వేర్వేరు పోటీ చేయనుంది. దీంతో వైసీపీకీ దాదాపు 18 నుంచి 20 సీట్ల వరకు వస్తాయని సర్వేలు వెల్లడిస్తున్నయి. ఇండియా టుడే సర్వేలోను ఏపీ, తెలంగాణలలో వరుసగా వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలదే హవా అని వెల్లడైంది. మూడ్ అఫ్ ది నేషన్ సర్వే ప్రకారం బీజేపీకి సీట్లు తగ్గినా ఉత్తర, పశ్చిమ, తూర్పు రాష్ట్రాల్లో వారికే ఆధిక్యం రానున్నాయి. దక్షిణాదిలో మాత్రం ప్రాంతీయ పార్టీల హవా కనిపించనుంది.

ప్రాంతీయ పార్టీలదే హవా

ప్రాంతీయ పార్టీలదే హవా

ప్రాంతాల వారీగా ఓట్ల శాతం చూస్తే ఉత్తర భారతంలో ఎన్డీయేకు 40, యూపీఏకు 23, ఇతరులకు 47 సీట్లు వస్తాయి. పశ్చిమ భారతంలో ఎన్డీయేకు 46, యూపీఏకు 45, ఇతరులకు 12, తూర్పు భారతాన ఎన్డీయేకు 37, యూపీఏకు 25, ఇతరులకు 38 సీట్లు రానున్నాయి. దక్షిణాదిన ఎన్డీయేకు కేవలం 18 సీట్లు మాత్రమే రానున్నాయి. యూపీఏకు 43, ఇతరులకు 39 రానున్నాయి. దక్షిణాది ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్, వైసీపీ, డీఎంకే, అన్నాడీఎంకే, జేడీఎస్ ఉన్నాయి. ఈ పార్టీలకే దాదాపు 40 సీట్లు రానున్నాయని తేలింది. ఇక్కడ టీడీపీని యూపీఏలో జతకట్ట సర్వే చేశారు.

సర్వేలో దేశవ్యాప్తంగా 19వేలమంది

సర్వేలో దేశవ్యాప్తంగా 19వేలమంది

మూడ్‌ ఆఫ్ ది నేషన్ సర్వేలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, యూపీ సహా 19 రాష్ట్రాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించారు. మొత్తం 97 లోక్‌సభ స్థానాలు, 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. ఓ ప్రశ్నావళిని రూపొందించి దాని ఆధారంగా ప్రజలను ర్యాండమ్‌గా ఇంటర్వ్యూ చేశారు. ఈ సర్వేలో 69 శాతం గ్రామీణ, 31 శాతం పట్టణవాసులు ఉన్నారు. ఈ సర్వేతో పాటు ఉత్తర ప్రదేశ్‌లోని 20 లోక్‌సభ స్థానాల్లో 1,103 ఇంటర్వ్యూలు చేశారు. ప్రశ్నావళిని స్థానిక భాషల్లోకి అనువాదంచారు. ఈ సర్వేను 2018 డిసెంబర్‌ 28 నుంచి 2019, జనవరి 8 మధ్య చేశారు. ఈ సర్వేలో 19 రాష్ట్రాలకు చెందిన 13,179 మంది పాల్గొన్నారు.

English summary
The India Today-Karvy Insights Mood of the Nation poll is aimed at understanding the political pulse of the nation just months before the Lok Sabha election. A total of 13,179 people participated in the survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X