• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కన్నతల్లి కసాయిగా మారి.. కూతురును బస్సు కిందకు తోసి.. ఏం కష్టమొచ్చిందో పాపం..!

|

హైదరాబాద్ : కన్నతల్లి ఉన్మాదిలా మారింది. కన్న కూతురును బస్సు కిందకు తోసేసింది. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ మొత్తానికి ఆ తల్లి కన్నబిడ్డను అత్యంత పైశాచికంగా చంపాలని భావించింది. కుటుంబ కష్టాలో.. భర్తతో గొడవలో.. ఇంకేదో కారణం తెలియదు గానీ చివరకు ఆ తల్లి చావు దెబ్బలు తినాల్సి వచ్చింది. నవ మాసాలు మోసి కని ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన కన్న కూతురును ఎందుకు వదిలించుకోవాలని చూసిందనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం లేకుండా పోయాయి. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది.

కన్న కూతురును చంపాలనుకుందా ఆ తల్లి..!

కన్న కూతురును చంపాలనుకుందా ఆ తల్లి..!

కన్నకూతురును ఏ తల్లి కూడా చంపాలనుకోదు. పరిస్థితులు తలకిందులైనా సరే బిడ్డలను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారే తప్ప వారి ప్రాణాలకు ముప్పు తలపెట్టరు. అలా చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ కుటుంబంలోనైనా పిల్లల సంతోషానికి మించి కావాల్సింది ఏముంటుంది. వారి ఆలనా పాలనా చూస్తూ ముద్దు మురిపెంగా పెంచుతూ ప్రయోజకులను చేయడమే పేరెంట్స్ బాధ్యత. అయితే హైదరాబాద్‌లో కన్నతల్లి తన కూతురును బస్సు కిందకు తోసేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఏం జరిగిందో తెలియదు గానీ కన్నబిడ్డను చంపాలని చూడటం మాత్రం ముమ్మాటికీ తప్పే కదా అంటున్నారు కొందరు.

కేటీఆర్‌ను తిట్టిన అధికారి.. 10 కోట్ల నిధులు ఇస్తే.. కోటి మాయం చేస్తానంటూ పిచ్చి కూతలు..!

బస్సు కిందకు తోసేసి.. అమానవీయ ఘటన

బస్సు కిందకు తోసేసి.. అమానవీయ ఘటన

హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో కన్నతల్లి కసాయిగా మారిన ఘటన చర్చానీయాంశంగా మారింది. సొంత కూతురును బస్సు కిందకు తోసేసిన ఘటన కలకలం రేపింది. రోడ్డుపై అలా నడుచుకుంటూ వెళుతూ ఒక్కసారిగా తన చేతిలోని బిడ్డను అటుగా వస్తున్న బస్సు కిందకు విసిరేసింది. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. లేదంటే చిన్నారి ప్రాణాలు అత్యంత దారుణంగా గాల్లో కలిసి పోయేవి. ఇదంతా గమనిస్తున్న స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

చిన్నారిని బస్సు కిందకు విసిరేయడం చూసిన స్థానికులు ఆ చిన్నారిని చేరదీశారు. బలంగా విసిరేయడంతో తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఆ మేరకు స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే సదరు తల్లిని మాత్రం ఇలా ఎందుకు చేశావంటూ నిలదీశారు. అయినా కూడా ఆమె ఏం చెప్పలేకపోయింది. దాంతో స్థానికులు ఆగ్రహావేశాలకు గురై ఆమెను చెట్టుకు కట్టేశారు. అక్కడి మహిళలు కసాయి తల్లిలా ఎందుకు మారావంటూ ప్రశ్నించారు. అయినా కూడా ఆమె ఎలాంటి సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది.

ఎందుకు చేసిందో అలా..!

ఎందుకు చేసిందో అలా..!

విషయం తెలిసి స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ తల్లి అలా ఎందుకు చేసిందనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అసలు విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

పొలాలు పచ్చగా ఉంటే కళ్లు మండుతున్నాయా.. కేటీఆర్ చురకలు..!

ఏం కష్టమొచ్చిందో పాపం..!

ఏం కష్టమొచ్చిందో పాపం..!

ఆ కన్నతల్లి కసాయిగా ఎందుకు మారింది. సొంత బిడ్డను ఎందుకు చంపాలనుకుంది. ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సింది పోయి ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంది. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు ఆమె నోరు విప్పితే గానీ సమాధానాలు దొరకవేమో. ఏం కష్టమొచ్చిందో గానీ కన్న కూతురును ఇంత నిర్ధాక్షిణ్యంగా చంపాలనుకోవడం ముమ్మాటికీ తప్పే అంటున్నారు అక్కడి స్థానికులు. కుటుంబ కలహాలా లేదంటే భర్తతో గొడవలా.. కారణం ఏదైనా కన్న కూతురును బస్సు కిందకు తోసేసి చంపాలని చూడటానికి ఆ తల్లికి మనసెలా వచ్చిందనే కామెంట్లు వినిపించాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Mother became like a maniac. Own daughter was thrown under the bus. Whatever the difficulty was, the mother wanted to kill the baby in the most vile way. This incident took place in Hyderabad Kukatpally area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more