హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోత్కుపల్లి ఎజెండా ఖరారైందా.. ఇక ఆ జెండాయేనా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్ దూకుడుకు కాషాయం దండు కళ్లెం వేయనుందా? కారు జోరుకు కమలం పువ్వు బ్రేకులు వేయనుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పాగా వేయనుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆ క్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఆపరేషన్ కమలం స్పీడ్ పెంచారు. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలకు కాషాయం కండువా కప్పేందుకు సన్నద్ధమయ్యారు. తాజాగా సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు కమల తీర్థం పోసేందుకు రెడీ అవుతున్నారు.

మోత్కుపల్లి యూ టర్న్.. యస్ ఆర్ నో

మోత్కుపల్లి యూ టర్న్.. యస్ ఆర్ నో

సీనియర్‌ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజకీయాల్లో యూ టర్న్ తీసుకోబోతున్నారనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. త్వరలో బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం ఉత్కంఠ రేపుతోంది. జనబలం కలిగిన నేతగా రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న మోత్కుపల్లి కమలం పువ్వు వైపు చూస్తున్నారనే అంశం హాట్ టాపికయింది. ఆ క్రమంలో ముహుర్తం కూడా ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. దానికి బలం చేకూరుస్తూ ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లడం చర్చానీయాంశమైంది.

హైదరాబాద్‌లోని మోత్కుపల్లి ఇంటికి వెళ్లిన బీజేపీ అగ్రనేతలు పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ వెంటనే ఆయన అనుచరగణంతో మంతనాలు జరపడంతో ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లేననే వార్తలొస్తున్నాయి.

<strong>సహజీవనం.. హోంగార్డు మోసం.. గర్భవతిని చేసి, చివరకు..!</strong>సహజీవనం.. హోంగార్డు మోసం.. గర్భవతిని చేసి, చివరకు..!

 విద్యార్థి దశ నుంచే పాలిటిక్స్..!

విద్యార్థి దశ నుంచే పాలిటిక్స్..!

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి మోత్కుపల్లి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతూ ప్రజాసేవకు అంకితమయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గనులు, విద్యుత్‌ శాఖ, సాంఘిక సంక్షేమం, టూరిజం శాఖ మంత్రిగా అనేక పదవులు ఆయన్ని వరించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మోత్కుపల్లి ఆ జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో తళుక్కుమన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక.. టీటీడీపీలో సీనియర్ నేతగా పార్టీకి సేవలందించారు. అయితే గవర్నర్ పదవి వస్తుందని ఆశలు కల్పించిన చంద్రబాబు నాయుడు చివరకు హ్యాండ్ ఇచ్చారని ఆయన బహిరంగంగానే విమర్శించారు. ఆ క్రమంలో టీడీపీపై కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశారు. దాంతో ఆయన్ని టీడీపీ నుంచి బహిష్కరించారు. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్ సపోర్టుతో ఎమ్మెల్యేగా ఆలేరు నుంచి పోటీ చేసినా విజయం వరించలేదు. దాంతో కొంతకాలంగా ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు.

మోత్కుపల్లి పొలిటికల్ కెరీర్

మోత్కుపల్లి పొలిటికల్ కెరీర్

1982లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు మోత్కుపల్లి. 1983లో ఆలేరు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలా చాలాసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1999లో మాత్రం అనూహ్య పరిణామాలతో ఆయన పార్టీ మారాల్సి వచ్చింది. అలా ఆలేరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 2004లో టీడీపీ గూటికి చేరి ఆలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2008లో మరోసారి ఆలేరులో జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2009లో తుంగతుర్తి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2014లో ఖమ్మం జిల్లా మధిరలో పోటీ చేసి ఓడిపోయారు. అదలావుంటే 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో అప్పటి ప్రధాని పీవీ నరసింహ రావుపై పోటీ చేసి ఓడిపోయారు.

<strong>వామ్మో.. ఆటోలో 24 మంది.. ఏంది నాయనా ఇది..!</strong>వామ్మో.. ఆటోలో 24 మంది.. ఏంది నాయనా ఇది..!

 రాజకీయాల్లో తనదైన ముద్ర.. బీజేపీలోకి ఎప్పుడంటే..!

రాజకీయాల్లో తనదైన ముద్ర.. బీజేపీలోకి ఎప్పుడంటే..!


ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు మోత్కుపల్లి. మాజీమంత్రిగా పనిచేసిన అనుభవం, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానమున్న మోత్కుపల్లి బీజేపీలో చేరితే రాష్ట్రంలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు లక్ష్మణ్. ఆ మేరకు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. బీజేపీ నేతల ఆహ్వానం మేరకు తాను కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 25వ తేదీన బీజేపీలో చేరేందుకు మోత్కుపల్లి ధృవీకరించినట్లు సమాచారం. ఆ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమల తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. తన వెంట భారీగా అనుచరగణాన్ని కూడా బీజేపీలోకి తీసుకెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
Will TRS aggression in Telangana be tarnished? Will the lotus flower brakes on the car? Telangana to be panned by the next assembly elections? Many such questions answer the latest developments. To that end, the state BJP leaders have increased Operation Lotus Speed. Disgruntled leaders in other parties were preparing to cover the saffron scarf. Former minister Mothkupalli Narsimhulu, who has a long political experience, is ready to join in BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X