హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై విమర్శలు.. కేసీఆర్‌పై ప్రశంసలు: చివరకు బీజేపీ గూటికి మోత్కుపల్లి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతయ జనతా పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడితో కలిసి సోమవారం ఢిల్లీకి పయనమయ్యారు.

జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి మోత్కుపల్లి..

జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి మోత్కుపల్లి..

తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆ పార్టీ కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి పలువురు కీలక నేతలు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడు వారి బాటలోనే మోత్కుపల్లి నర్సింహులు కూడా చేరారు. మంగళవారం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీకి పయనమయ్యారు. ఇటీవల మోత్కుపల్లి ఇంటికి వెళ్లి బీజేపీలోకి రావాలంటూ ఆయనను ఆహ్వానించారు. రెండు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం మోత్కుపల్లి బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

చంద్రబాబును తీవ్రంగా విమర్శించి..

చంద్రబాబును తీవ్రంగా విమర్శించి..


తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మోత్కుపల్లి నర్సింహులు కీలక నేతగా కొనసాగిన విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హాయంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా ఆయన టీడీపీని వీడారు. ఆ తర్వాత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదంటూ తిరుపతికి వెళ్లి మరీ మొక్కుకున్నారు.

కేసీఆర్‌పై ప్రశంసలు.. చివరకు

కేసీఆర్‌పై ప్రశంసలు.. చివరకు

టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత మోత్కుపల్లి రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. గతంలో పలుమార్లు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కూడా చేశారు. కేసీఆర్ చేపడుతున్న పథకాలు బాగున్నాయంటూ కొనియడారు. దీంతో మోత్కుపల్లి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. తాజాగా, ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా, మోత్కుపల్లి చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

English summary
Former minister Motkupalli Narasimhulu joins in BJP on december 7th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X