హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ కు ఎంపీ అసద్ వినతి - ఆ పనులు పూర్తి చేయండి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ ఎంపీ..ఎంఐఎం అధినేత అసద్ మంత్రి కేటీఆర్ కు ఓ అభ్యర్దన చేసారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా కొత్త ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మొత్తం 31 కిలోమీటర్లు ఉండగా.. 6 వేల 250 కోట్ల రూపాయలు ఖర్చుతో ఏర్పాటుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ ప్రకటన రోజునే ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

మెట్రోను శంషాబాద్ వరకు పొడిగించాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు సిద్దం చేసారు. రెండో ఫేజ్ విస్తరణలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టే అంశం పైన చర్చలు జరిగాయి. దీంతో పాటుగా బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకా పూల్ వరకు 26 కిలో మీటర్లు అదే విధంగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు 5 కిలో మీర్ల మేర మెట్రో పనులకు నిర్ణయించారు. మొత్తం 63 కిలో మీటర్ల పేర విస్తరించే ప్రణాళికలను త్వరలో ప్రారంభిస్తామని తాజాగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇక, ఈ రోజు ఎయిర్‌పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రో నిర్మాణానికి శంఖుస్థాపన అంశాన్ని మంత్రి వెల్లడించారు.

MP Asad Owaisi asks Minister KTR To start the work of MGBS, Imlibun to Falaknuma of Metro rail cariidor 2 phase

దీంతో, త్వరలోనే శంషాబాద్ నుంచి మెట్రో అందుబాటులోకి రానుంది. కేంద్ర సహకరించకపోయినా..పూర్తి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేసారు. ఇక, మెట్రో విస్తరణ పైన కేటీఆర్ ప్రకటనతో ఎంపీ అసద్ స్పందించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలో మీటర్ల కారిడార్ ను ప్రారంభించాలని అసద్ కోరారు. దీనికి గాను బడ్జెట్ లో రూ 500 కోట్లు కేటాయించిందని గుర్తు చేసారు. అనేక మంది హైటెక్ సిటీకి ఈ ప్రాంతం నుంచి ఉన్న రద్దీని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీని పైన మంత్రి కేటీఆర్ తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.

English summary
Hyderabad MP and MIM chief Asaduddin Owaisi asked Minister KTR to start the work of MGBS, Imlibun to Falaknuma of Corridor II Metro Rail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X