హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే...

|
Google Oneindia TeluguNews

సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈనేపథ్యంలోనే పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై పై సీఎం కేసీఆర్ దశనిర్ధేశనం చేశారు. కాగా ఈ సమావేశాలకు లోక్‌సభ ,రాజ్యసభ ఎంపీలు కలిశారు.ఈనేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా జరుగుతున్న సమావేశంలో లోక్‌సభా,రాజ్యసభ పక్షనేతలను సీఎం కేసీఆర్ నియమించారు.

కాగా పార్లమెంటరీ పార్టీ నేతగా సీనియర్ నాయకులు ఎంపీ కే.కేశవరావును ఎంపిక చేశారు. ఇక లోక్‌సభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్ రావును, రాజ్యసభలో టీఆర్ఎఎస్ పక్ష నాయకుడిగా కేకే కొనసాగనున్నారు. ఇక గత లోక్‌సభ పక్ష నాయకుడిగా ఉన్న జితెందర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుండి పోటి చేసిన కవిత ఓడిపోవడంతో పార్లమెంటరీ పక్ష నేత పదవిని రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేకే కు కట్టబెట్టారు.

MP Dr K Keshav Rao was elected as the TRS Parliamentary Party leader

Recommended Video

నేడు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం

ఇక టీఆర్ఎస్ నుండి తోమ్మిది మంది ఎంపీల్లో కొత్తవారు కావడం ,మరికొందరికి పార్లమెంట్‌లో అనుభవం లేకపోవడంతో పాటు సమావేశాల్లో పార్టీ తరఫున గళం విప్పి రాష్ట్ర్ర సమస్యను మాట్లాడే వారు లేకపోవడం గమనార్హం...ఈనేపథ్యంలోనే పార్టీ టీడీపీ నుండి పార్టీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నామ నాగేశ్వర్ రావుకు పార్లమెంట్ పక్షనేతగా పదవిని అప్పగిస్తే పలు విమర్శలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన లోక్ సభ పక్ష నాయకుడిగా అవకాశం కల్పించారు.

English summary
The TRS Parliamentary Party meeting was held under the chairmanship of TRS President and Chief Minister K Chandrashekhar Rao at Pragathi Bhavan.in the meeting Senior MP Dr K Keshav Rao was elected as the TRS Parliamentary Party leader while Khammam MP Nama Nageswara Rao was elected as the party’s leader in Lok Sabha. Dr Keshav Rao was elected as the party’s leader in Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X