హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళలపై దాడుల్ని సమూలంగా నిర్మూలించాలి : ఎంపీ కవిత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మహిళలపై జరుగుతున్న దాడులను పూర్తిస్థాయిలో నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఎంత అలర్ట్ గా ఉన్నప్పటికీ.. మహిళలపై ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్డీకాపూల్ లో మహిళా భద్రతా విభాగం నూతన భవనం ప్రారంభోత్సవానికి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మార్చి 15 నుండి ఒంటిపూట బడులు.. ఆదేశాలు జారీ మార్చి 15 నుండి ఒంటిపూట బడులు.. ఆదేశాలు జారీ

దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు మంచిపేరు వచ్చిందని అన్నారు కవిత. నేరాలు తగ్గుముఖం పట్టడానికి అత్యాధునిక టెక్నాలజీ వాడుతూ దేశంలోనే ముందు వరుసలో నిలిచారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, షీ క్యాబ్స్, భరోసా సెంటర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాదు మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా యాప్ లు కూడా తెరపైకి తెచ్చినట్లు వివరించారు.

mp kavitha says attacks on womens should be prevent

మహిళలపై దాడులకు తెగబడుతున్న నిందితులకు తగిన శిక్ష పడేలా వుమెన్ వింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు కవిత. మహిళలకు అండగా నిలబడేందుకు.. ప్రతి జిల్లాలో భరోసా కేంద్రాల ఏర్పాటుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులొచ్చినా 100 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. విద్యార్థినుల రక్షణ కోసం తీసుకొచ్చిన హాక్ ఐ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

English summary
Nizamabad MP Kavitha saying that needs to be eradicated against the attacks on women. Despite the alert, there are still attacks on women. Kavita was in attendance at the new building opening ceremony of Women's Security Department in Lakdikapool on Women's Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X