హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం ధరల వెనక కల్వకుంట్ల ట్యాక్స్... ఎంపీ రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో [ కేఎస్టీ } కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ అమలవుతుందని ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏ పనులు కావాలన్న ఆరు శాతం టాక్స్‌ను వసూలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ పన్నుల వసూళ్ల కోసం మాఫియా పనిచేస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మద్యం ధరల పెంపు వెనక కూడ ఇదే మాఫియా ఉందని అన్నారు. అందుకే మద్యం ధరలు పెరుగుతున్నాయని అన్నారు.

 ప్రధాని మోడీ కనీసం అపాయింట్‌మెంట్ కూడ ఇవ్వడం లేదు : రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కనీసం అపాయింట్‌మెంట్ కూడ ఇవ్వడం లేదు : రేవంత్ రెడ్డి

పెరగనున్న మద్యం ధరలు

పెరగనున్న మద్యం ధరలు

తెలంగాణలో మరో రెండు రోజుల్లో మద్యం ధరలు పెరగనున్నాయి. ఇంధుకోసం ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇవ్వగా.. గురువారం నుండి ఇవి అమల్లోకి రానున్నాయి. అయితే పెరగనున్న మద్యం ధరలకు ఎంపీ రేవంత్ రెడ్డి కొత్త బాష్యం చెప్పారు. ప్రభుత్వానికి కమీషన్లు ముట్టచెబితే...వేటికైనా అనుమతి ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మద్యం ధరల పెరుగుదల అని చెప్పారు.

ధరల పెంపుపై సీబీఐ విచారణ

ధరల పెంపుపై సీబీఐ విచారణ

మద్యం ధరల పెంపుదల కోసం ఓ ఎంపీ ఢిల్లీతోపాటు చెన్నై నగరాల్లో మకాం వేసి ఇందుకోసం సంప్రదింపులు జరిపారని అన్నారు. ధరల పెంపుదలలో భారి కుంభకోణం జరిగిందని , కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా మద్య నియంత్రణను చేయాల్సిన ఎక్సైజ్ శాఖ ఒక ప్రమోషనల్ ఎజెన్సీగా మారిపోయిందని అన్నారు.

మద్యం ధరలపై కోర్టుకు

మద్యం ధరలపై కోర్టుకు


దీంతో ఉత్పత్తి ధరల కంటే వెయ్యిశాతం ఎక్కువగా మద్యం విక్రయిస్తున్నారని అన్నారు. విపరీతంగా మద్యం ధరలు పెంచుతుంటే...వినియోగదారుల ఫోరం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వానికి కమీషన్లు ఇచ్చే బ్రాండ్లను మాత్రమే ప్రోత్సహిస్తున్నారని వీటిపై కేంద్రం స్పందించాలని, మరోవైపు రాష్ట్రం పెంచిన ధరలను తగ్గించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటూ కోర్టుకు వెళతానని స్పష్టం చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

English summary
MP Revanth Reddy has made serious allegations that the KST Tax implemented in the telangana state for every work
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X