హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో రవిప్రకాశ్‌ను కలిసిన ఎంపీ రేవంత్‌రెడ్డి

|
Google Oneindia TeluguNews

చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి కలిశారు. అరెస్ట్‌కు సంబంధించిన అంశాలపై రవిప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా రవిప్రకాశ్‌కు తన సంఘీబావాన్ని ప్రకటించారు. టీవీ9 లో నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారంటూ ఏబీసీఎల్ కంపనీ లిమిటెడ్ డైకర్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం ఆయన్ను విచారించిన పోలీసులు, అనంతరం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. దీంతో రవిప్రకాశ్‌కు 14 రోజుల డిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

 రవి ప్రకాశ్ కోట్లాది నిధులు దారి మళ్లించారు: బోర్డు అనుమతి లేకుండానే: క్రిమినల్ చర్యలు తప్పవా..! రవి ప్రకాశ్ కోట్లాది నిధులు దారి మళ్లించారు: బోర్డు అనుమతి లేకుండానే: క్రిమినల్ చర్యలు తప్పవా..!

టీవీ9 సీఈవో ఉన్న నేపథ్యంలోనే రవిప్రకాశ్ డైరక్టర్ల అనుమతి లేకుండా కంపని డబ్బులు డ్రా చేసుకుని, దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కోన్నారు. ఈ నేపథ్యంలోనే నిబంధనలకు విరుద్దంగా 9 నెలల్లో రూ.30 కోట్లు డ్రా చేశారని, బోనస్ పేరుతో రూ.18.30 కోట్లు, టీడీఎస్ రూ.11.74 కోట్లు డ్రా చేసి నకిలీ రికార్డులు స‌ృష్టించారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే రవిప్రకాశ్‌ను శనివారం బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

MP Revanth Reddy meet Ravi Prakash,

దీంతో ఆయన 409, 418, 420 తదితర నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కాగా గతంలోనూ టీవీ9 ఛానల్ నిర్వహణకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టి, లోగో విక్రయం ఆరోపణలతో సైబర్‌క్రైమ్‌, బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్లలో కొత్త యాజమాన్యం అలందా మీడియా సంస్థ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా గతంలో పెట్టిన కేసులపై ముందస్తు బెయిల్‌కు వెళ్లిన రవిప్రకాశ్‌కు కోర్టులో చుక్కెదురైంది. అయితే బెయిల్‌పై సుప్రిం కోర్టుకు కూడ వెళ్లారు.చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసుల ముందు వారం రోజుల విచారణ ఎదుర్కోన్నారు.

English summary
TPCC working President and MP Revanth Reddy to meet Ravi Prakash, former CEO of TV9 in Chanchalguda jail to express his solidarity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X