హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషమంగా ముఖేశ్ గౌడ్ ఆరోగ్య, చికిత్స నిలిపివేసిన వైద్యులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయన శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో వైద్యులు ట్రీట్ మెంట్ నిలిపివేశారు. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీని వీడలేదు.

క్యాన్సర్‌తో పోరాటం ..
గత కొన్నినెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు ముఖేశ్ గౌడ్. క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ మరింత విషమించినట్టు అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలో గోషామహల్ నుంచి పోటీచేశారు. బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల సమయంలో అంబులెన్స్‌లో వచ్చి ఓటేసిన సంగతి తెలిసిందే. ముఖేశ్ గౌడ్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన అభిమానులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

mukesh goud health is serious

ముఖేశ్ గౌడ్ .. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. హైదరాబాద్‌లో అంజన్ కుమార్ యాదవ్, ముఖేశ్ గౌడ్ ఇద్దరూ క్యాబినెట్‌లో చోటు దక్కింది. వైఎస్ మరణం తర్వాత .. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా ఆమాత్యుడిగా కొనసాగారు ముఖేశ్ గౌడ్. 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు ముఖేశ్ గౌడ్. ఆరోగ్యం సరిగా ఉన్న సమయంలో టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగినా .. ఆయన కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు.

English summary
Former minister and Congress leader Mukesh Goud worried about the health situation. The doctors stopped treating him because his body did not respond to treatment. He was diagnosed with cancer. He contested the 2014 and 2019 Assembly elections and lost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X