• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మున్సిపల్ ఎన్నికలపై నేడు హైకోర్టులో కొనసాగనున్న విచారణ .. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

|

తెలంగాణ రాష్ట్రంలోని అధికార టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలని భావిస్తోంది. అందుకోసం మున్సిపల్ ఎన్నికల విషయంలో హైకోర్టులో జరుగుతున్న విచారణకు ప్రభుత్వం నుండి అందించాల్సిన అన్ని వివరాలను అందించి హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఎదురు చూస్తుంది . అయితే హైకోర్ట్ ఈ కేసును 26 వ తారీఖుకి వాయిదా వేసింది. అయితే నిన్న కోర్టులో ఈ వ్యవహారంపై వాడీ వేడి విచారణ కొనసాగింది. నేడు కూడా విచారణ జరగనుంది .

భాగ్య నగరానికి వానగండం.. అర్ధరాత్రి కుండపోత .. ప్రమాదకరస్థాయిలో హుస్సేన్ సాగర్

గతంలో మున్సిపల్ ఎన్నికల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి అక్షింతలు వేసిన హైకోర్టు చిన్న చిన్న లోపాలున్నా ఎన్నిక ఆగకూడదని చెప్పింది. కానీ తాజాగా ప్రభుత్వం వైపు నుంచి ఎన్నికల నిర్వహణకు జరగాల్సిన ఈ ప్రక్రియ అంతా జరిగినట్లుగా కోర్టుకు నివేదిక అందించినా ఈ కేసు విచారణ జాప్యం అవుతూ వస్తుంది. ఇక నిన్న జరిగిన విచారణలోనూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి హైకోర్టుకు స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Municipal Elections hearing to be held in High Court today .. tension in political circles

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచదర్‌రావు వాదనలు వినిపించారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వార్డుల విభజన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశామని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ తన వాదన వినిపిస్తూ ప్రభుత్వం చెబుతున్న వాదనలు పూర్తిగా అవాస్తవమని, ఇప్పటివరకు ఓటర్ల జాబితా, వార్డుల విభజన సక్రమంగా జరగలేదని తెలిపారు. మరోవైపు 75 మున్సిపాలీటీలకు స్టే విధించిందని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే స్టే విధించిన వాటిని వదిలిపెట్టి మిగిలిన మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికలసంఘం హై కోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసు విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేయడంతో ఇవాళ మరోసారి విచారణ కొనసాగనుంది.

టిఆర్ఎస్ పార్టీ హైకోర్టు ఎన్నికలకు పచ్చ జెండా ఊపాలని ఎదురు చూస్తుంది. ఎన్నికలు జాప్యం మంచిది కాదని గులాబీ పార్టీ భావిస్తున్న నేపధ్యంలోనే త్వరితగతిన ఎన్నికలకు వెళ్ళాలని చూస్తుంది. ఎక్కువ జాప్యం జరిగితే గులాబీ పార్టీకి నష్టం అన్న భావన వ్యక్తం అవుతుంది. మరి నేడు విచారణ జరగనున్న నేపధ్యంలో హైకోర్టు మున్సిపల్ ఎన్నికల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana State's ruling TRS party intends to hold municipal elections as early as possible. For that purpose, the green signal from the High Court is awaiting . In the High Court with all the details to be provided by the Government. However, the High Court postponed the case to 26th. However, a heated investigation into the matter continued in court yesterday.Today also the hearing will continue .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more