హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టార్గెట్ మున్సిపాలిటీ.. నవంబర్‌లోనే ఎన్నికలన్న కేసీఆర్

|
Google Oneindia TeluguNews

హుజుర్‌నగర్ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలను టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్ , రానున్న నవంబర్‌ నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. హుజురబాద్ ఉప ఎన్నిక తర్వాత పార్టీ కార్యాలయంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈ సంధర్భంగా మున్సిపల్ ఎన్నికలపై స్పందించారు. కొత్త మున్సిపల్ చట్టం ద్వార గ్రామాలు పట్టణాలు అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తామని చెప్పారు.

ఈనేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, మరికొన్ని కేసులు మరో సింగిల్ బెంచ్ వద్ద ఉన్నాయని చెప్పారు. వాటికి సంబంధించి రేపు వాటిపై తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక తీర్పు అనంతరం ఈసీ నుండి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన రానుందని అన్నారు.. అనంతరమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. దీంతో నవంబర్ నెలలోనే మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తామని అన్నారు.

municipal elections will be held in November CM KCR announced

ఇక మున్సిపల్ ఎన్నికల అనంతరం పట్టణానికి సంబంధించిన పట్టణ ప్రగతిపై ప్రణాళిక కోసం నెలరోజుల్లో పూర్తి చేసి అభివృద్దికి బాటలు వేస్తామని చెప్పారు. ఇందుకోసం 14వ ఆర్ధిక సంఘం ద్వార 1030 కోట్లు ఉన్నాయని చెప్పారు. ఇందుకు సమానంగా రాష్ట్ర బడ్జెట్‌లో కూడ నిధులు కేటాయించాని తెలిపారు. దీంతో మొత్తం కలిపి మున్సిపాలిటీల అభివృద్దికి 2060 కోట్ల రూపాయలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు.

English summary
The municipal elections will be held in November CM KCR announced. 2060 crore is ready for development of municipalities, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X