హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గులాబీ పార్టీలో మొదలైన మున్సిపల్ టికెట్ల లొల్లి .. టికెట్ కోసం పెట్రోల్ పోసుకున్న టీఆర్ఎస్ నేత

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పంచాయితీ మొదలైంది. ముఖ్యంగా అధికార పార్టీలో పెద్ద ఎత్తున టికెట్ల కోసం పోటీ నెలకొంది. టికెట్ల కోసం ఆశావహులు మంత్రుల, ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు క్యూ కడుతున్నారు. ఇక ఇదే సమయంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కే అవకాశం లేదని తెలుసుకున్న ఒక టీఆర్ఎస్ నేత , ఆశావహుడు పెట్రోలు పోసుకుని హల్‌చల్ చేసిన ఘటన టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం ఎంతగా ప్రయత్నాలు జరుగుతున్నాయో అర్ధం అయ్యేలా చెప్తుంది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

 గులాబీ పార్టీలో టికెట్ల కోసం మొదలైన పంచాయితీ

గులాబీ పార్టీలో టికెట్ల కోసం మొదలైన పంచాయితీ


సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలోని మంత్రి మల్లారెడ్డి కార్యాలయం వద్ద టికెట్ కోసం ఒక ఆశావహుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈమున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న వారు ఇప్పటికే టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన ఆశావహులు టికెట్ల కోసం పోటీ పడుతున్న పరిస్థితి ఉంది .

మంత్రి మల్లారెడ్డి ఇంటి ముందు టికెట్ రాదనీ తెలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఆశావహుడు

మంత్రి మల్లారెడ్డి ఇంటి ముందు టికెట్ రాదనీ తెలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఆశావహుడు

ఇక వీరంతా పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కోసం మంత్రి మల్లారెడ్డిని కలిసేందుకు బోయిన్‌పల్లిలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే మంత్రి తన కార్యాలయంలో టికెట్లు ఇచ్చే విషయంలో చర్చలు జరుపుతున్నారు. అంతలోనే ఓ వ్యక్తి తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని తెలుసుకుని మనస్తాపానికి గురయ్యాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు . అక్కడ వున్నా వారు అతన్ని ఆపి ఆత్మహత్యా యత్నం నుండి విరమింపజేశారు. దీంతో మంత్రి ఇంటి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అందరికీ న్యాయం చేస్తామన్న మంత్రి .. తలనొప్పిగా టికెట్ల లొల్లి

అందరికీ న్యాయం చేస్తామన్న మంత్రి .. తలనొప్పిగా టికెట్ల లొల్లి


దీంతో ఘర్షణ పెద్ద ఎత్తున జరిగే అవకాశంఉందని భావించిన మంత్రి మల్లారెడ్డి తన ఇంటి వెనక నుంచి వెళ్లిపోయి మల్లారెడ్డి గార్డెన్స్‌కు చేరుకున్నారు. కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని మంత్రి పిలుపు కోసం వేచి చూశారు. దీంతో ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడిన మల్లారెడ్డి.. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల లొల్లి తెలంగాణా మంత్రులకు, టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టేలా ఉంది.

English summary
Aspirants went to minister's house in Boinpally to meet Minister Mallareddy for tickets for the municipal elections. The minister is already in the process of giving tickets in his office. In the meantime, a man was offended when he realized that he had no ticket. He poured patrol and attempted suicide. There they stopped his suicide attempt. This created a tense atmosphere at the minister's house
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X