హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖాకీ కర్కశత్వం..? సీపీ పేరు చెప్పినా వినిపించుకోలే.. గాంధీలోకి రానీయకపోవడంతో భార్య మృతి..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల ఆస్పత్రులు చాలడం లేదు. ప్రభుత్వ దవాఖానలు కాదు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా బెడ్స్ ఉండటం లేదు. ఇటీవల ఓ హెడ్ కానిస్టేబుల్ భార్య అనారోగ్య బారినపడింది. రెండు, మూడు ప్రైవేట్ ఆస్పత్రుల తర్వాత చివరికీ గాంధీ దవాఖాన వద్దకొచ్చారు. కానీ అక్కడ డ్యూటీలో సహచర పోలీసులు మాత్రం లోపలికి వెళ్లనీయలేదు. తాను కూడా డిపార్ట్ మెంట్ అని చెప్పినా వినిపించుకోలేదు.

గ్రేటర్‌లో తగ్గుతున్న కరోనా కేసులు: 509 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1764..గ్రేటర్‌లో తగ్గుతున్న కరోనా కేసులు: 509 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1764..

కరోనా నుంచి కోలుకున్న పోలీసులకు కమిషనరేట్ పరిధిలో రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ వెల్‌కమ్ కార్యక్రమం నిర్వహించారు. తుర్కపల్లిలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న లతీఫ్ తన గోడును వెల్లబోసుకున్నాడు. తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో జూన్ 27న మలక్‌పేట్‌లోని యశోద హాస్పిటల్‌కి తీసుకెళ్లానని వివరించారు. లంగ్స్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న ఆమెకు ఐసీయూ ఫెసిలిటీ అవసరమని వైద్యులు తెలిపారు. తమ వద్ద బెడ్స్ లేవని చెప్పి వెనక్కి పంపించేశారు.

my wife died, due to police security do not allow to hospital

అక్కడి నుంచి గ్లోబల్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా సేమ్ సిచుయేషన్... అడ్మిట్ చేసుకోకపోవడంతో అదే అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ కూడా చుక్కెదురయ్యింది. తాను హెడ్‌ కానిస్టేబుల్‌ అని చెప్పినా తోటి సిబ్బంది పట్టించుకోలేదు. భార్యకు సీరియస్‌గా ఉందని చెప్పినా బందోబస్తులో ఉన్న పోలీసులు వినిపించుకోలేదు.

డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌‌ వద్దకు సీపీ రెఫరెన్స్‌ అని చెప్పినా పట్టించుకోలేదని లతీఫ్ వాపోయాడు. గాంధీ ఆస్పత్రిలో వెంటిలేటర్ పెట్టి.. ప్రాణాలు కాపాడాలని వేడుకున్నానని వివరించారు. డీసీపీతో చెప్పించినా వెళ్లనీయలేదు అని.. అర్ధరాత్రి ఒంటి గంటకు అంబులెన్స్ వెనక్కి తిప్పి పంపించారని కన్నీటి పర్యంతమయ్యారు. అలా కిలో మీటర్ వెళ్లేలోపే తన భార్య మృతిచెందిందని ఆవేదన చెందాడు.

Recommended Video

CM YS Jagan - 'ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవ్వాలి' || Oneindia Telugu

English summary
my wife died, due to police security do not allow to hospital head constable told to rachakonda police commissioner
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X