హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీస్ శాఖ ఉద్యోగికే ఎసరు.. పిన్నింటిలో చోరీ.. క్యా బాత్ హై..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : నల్లకుంట పరిధిలో నివాసముంటున్న తెలంగాణ పోలీస్ అకాడమీ ఉద్యోగి పిల్లి వినయకుమారి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఇటీవల జరిగిన దొంగతనాల్లో ఇది భారీ చోరీ కావడం గమనార్హం. దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ అంజన్ కుమార్ శుక్రవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

నిందితుల వద్ద నుంచి 53 తులాల బంగారం, 5.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు వాటి విలువ 24 లక్షల రూపాయలుగా ఉంటుందని సీపీ వివరించారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీలో టెలిఫోన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న పిల్లి వినయ కుమారి ఇంట్లో ఆమెకు కూతురు వరసయ్యే కుష్బూ నాయుడు అలియాస్‌ నక్కీ డుప్లికేట్ తాళాలతో చోరీకి పాల్పడటం గమనార్హం. ఆమెకు నిమ్మ రసంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి మత్తులోకి జారుకున్నాక తన ప్రియుడు అతడి మిత్రుడి సాయంతో దొంగతనానికి స్కెచ్ వేసింది కుష్బూ.

మీ డబ్బులు జర భద్రం.. మహా కంత్రీగాళ్లు వచ్చేశారు..!మీ డబ్బులు జర భద్రం.. మహా కంత్రీగాళ్లు వచ్చేశారు..!

nallakunta police academy employee house theft traced out

అయితే ఈ కేసులో టెక్నాలజీ ఉపయోగించి పిల్లి వినయకుమారి ఫ్యామిలీ మెంబర్స్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయడంతో చిక్కుముడి వీడింది. అప్పటికే సదరు నిందితులు దొంగిలించిన బంగారు ఆభరణాలను అమ్మేయడానికి సిద్ధపడ్డారట. ఆ క్రమంలో వారు బేగంపేటలో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు అటాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1 నిందితురాలిగా కుష్బూ నాయుడు, ఏ2 నిందితులుగా సుమల వంశీకృష్ణతో పాటు ఏ3 నిందితుడిగా సూర్యను పేర్కొన్నట్లు సీపీ వెల్లడించారు.

English summary
Hyderabad Nallakunta big theft case traced out. Police Academy Employee Pilli Vinayakumari step daughter sketch for that theft with help of her boyfriend and his friend. Police recovered Gold Ornaments from the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X